గచ్చిబౌలి గురుకుల స్కూల్‌లో విద్యార్ధుల మధ్య ఘర్షణ:విద్యార్ధి గొంతు కోసిన మరో స్టూడెంట్

Published : Apr 29, 2022, 09:33 AM ISTUpdated : Apr 29, 2022, 09:44 AM IST
 గచ్చిబౌలి గురుకుల స్కూల్‌లో విద్యార్ధుల మధ్య ఘర్షణ:విద్యార్ధి గొంతు కోసిన మరో స్టూడెంట్

సారాంశం

హైద్రాబాద్ గచ్చిబౌలి గురుకుల పాఠశాలలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది., టిఫిన్ విషయం జరిగిన ఘర్షఁణ విద్యార్ధి గొంతు కోసే వరకు వెళ్లింది. గాయపడిన విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ Gachibowliలో గురుకుల పాఠశాలలో విద్యార్ధిపై తోటి విద్యార్ధి కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్ధుల మధ్య గొడవలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

Hyderabadగచ్చిబౌలిలో  Residential  పాఠశాలలో  గురువారం నాడు విద్యార్ధుల మధ్య Clash చోటు చేసుకొంది. Tiffin విషయంలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. అయితే ఈ ఘర్షణ విషయం తెలుసుకున్న టీచర్లు  విద్యార్ధులను మందలించారు.దీంతో  విద్యార్ధులు  తమ రూమ్ లకు వెళ్లిపోయారు. అయితే ఈ ఘర్షణను దృష్టిలో పెట్టుకొన్న ఓ విద్యార్ధి రాత్రి పూట తనతో గొడవకు దిగిన సాత్విక్ అనే  విద్యార్ధి గొంతును knife తో కోశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర విద్యార్ధులు టీచర్లకు సమాచారం ఇచ్చారు . వెంటనే గాయపడిన విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై గురుకుల స్కూల్ టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?