ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ... 40 ఇల్లు దగ్ధం

Published : Apr 29, 2022, 04:09 AM ISTUpdated : Apr 29, 2022, 05:03 AM IST
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ... 40 ఇల్లు దగ్ధం

సారాంశం

Fire accident: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈదురుగాలులు, ఎండ తీవ్ర‌త వ‌ల్ల‌ మంట‌లు భారీ ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో  40 ఇళ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఈ విషాద‌క‌ర‌ ఘ‌ట‌న మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామ‌ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జ‌రిగింది.    

Fire accident: ములుగు జిల్లాలో ఘోర‌ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంతో 40 ఇళ్లు దగ్ధం అయ్యాయి. మంగపేట మండలం శనిగకుంట వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు.. దావానంలా ఊరంతా వ్యాపించాయి.  ఈ ప్ర‌మాదంలో  40 ఇళ్లు దగ్ధం కావడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు.. దావానంలా ఊరంతా వ్యాపించాయి. దాంతో ఆదివాసీలు ప్రాణభయంతో పిల్లలను పట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని,  వారు కోరుతున్నారు. అగ్ని ప్రమాదంతో అలర్ట్ అయిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ఆ ప్రాంతం అంతా అంధకారంగా మారింది. స‌హాయ‌చ‌ర్య‌లు కొన‌సాగుతోన్నాయి.

 అగ్ని ప్రమాదం జరిగి 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వెంటనే అవసరమైన సాయం అందించాలని, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!