మానసిక వికలాంగురాలిపై కానిస్టేబుల్, పెదనాన్న అత్యాచారం.. డబ్బాశతో పెద్దమ్మ దుర్భుద్ది...

Published : Apr 29, 2022, 08:55 AM IST
మానసిక వికలాంగురాలిపై  కానిస్టేబుల్, పెదనాన్న అత్యాచారం.. డబ్బాశతో పెద్దమ్మ దుర్భుద్ది...

సారాంశం

నిజామాబాద్ లో దారుణం వెలుగుచూసింది. చేరదీసిన పెదనాన్నే అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. పెద్దమ్మ డబ్బాశతో పక్కింటి కానిస్టేబుల్ కి అప్పజెప్పింది. 

నిజామాబాద్ : nizamabadలో ఓ మానసికవికలాంగురాలిమీద పెదనాన్న, మరోవ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనాథగా మారిన సొంత తమ్ముడి కూతురిని అక్కున చేర్చుకుని ఆ పెదనాన్న దారుణానికి ఒడిగట్టాడు. కన్నకూతుర్లా చూసుకోవాల్సిన ఆ పెద్దమ్మ కాసులకు కక్కుర్తిపడి.. మానసిక వికలాంగురాలు అనైనా చూడకుండా.. సభ్యసమాజం తలదించుకునేలాంటి పనికి ఒడిగట్టింది. 

తల్లిదండ్రులను కోల్పోయిన 14 ఏళ్ల బాలికను ఎనిమిదేళ్ల క్రితం.. సొంత పెదనాన్న, పెద్దమ్మలు అక్కున చేర్చుకున్నట్లు చేర్చుకుని.. ఇప్పుడు పెదనాన్నవయసు వావివరుసలు మరచి పోయి ప్రవర్తిస్తే.. డబ్బు కక్కుర్తితో పెద్దమ్మ ఆ యువతిని ఓ వ్యక్తికి అప్పగించి దుర్భుద్ధి చూపించింది. ఎంత ధైన్యమైన పరిస్థితి అంటే వీరిద్దరి దాష్టీకం హద్దుమీరి సాగుతున్నా వాటి గురించి తెలుసుకోలేని స్థితి ఆమెది. ఎందుకంటే ఆమె దివ్యాంగురాలు. మానసిక వైకల్యంతో ఉన్న ఆమె తనకు ఏం జరిగినా బయటకు వ్యక్తం చేయలేని నిస్సహాయురాలు. ప్రస్తుతం బాధిత యువతి 8 నెలల గర్భిణీ.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.  గురువారం ఉదయం ఇది వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓ జంట నిజామాబాద్ లో కాపురం ఉంటుంది.  భర్త వయస్సు 61, అతడి సోదరుడు, సోదరుడి భార్య 8 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒకరి వయసు 14 కాగా మరొకరికి రెండేళ్లు. తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో పెద్ద కుమార్తె మానసిక వైకల్యానికి గురి అయింది.  ఆ ఇద్దర్నీ నిజామాబాదులో ఉండే పెద్దమ్మ,  పెదనాన్న  తెచ్చుకుని  సాకుతున్నారు. ప్రస్తుతం వారిలో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి పదేళ్లు.

కన్నకూతురిలా చూడాల్సిన పెద్దమ్మే..
యువతిని కన్నకూతురి కంటే ఎక్కువగా చూడాల్సి ఉండగా పెద్దమ్మ దారుణానికి పాల్పడింది. సమీపాన ఉన్న కానిస్టేబుల్ చంద్రకాంత్ (56) నుంచి డబ్బులు ఆశించి ఆమెను అప్పగించింది. భార్య ఇంట్లో లేని సమయంలో సైతం బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇన్నాళ్లు బయటకు విషయం పొక్కలేదు. బాధితురాలి చెల్లి ద్వారా తొలుత ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్,  బాధితురాలి పెదనాన్న, పెద్దమ్మ లను పోలీసులు నిందితులుగా చేర్చారు. బాధితురాలిని సంరక్షణ నిమిత్తం సఖీ కేంద్రానికి తరలించారు. 

ఏఆర్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు
యువతిపై అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్ సిపి నాగరాజు సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్