
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో అదృశ్యమైన విద్యార్ధి Nikhil మృతదేహం Durgam Cheruvuలో శుక్రవారం నాడు లభ్యమైంది. ఈ నెల 13వ తేదీన సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుండి విద్యార్ధి నిఖిల్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ దుర్గం చెరువులో నిఖిల్ Dead body లభ్యమైంది. నిఖిల్ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.