ఖమ్మం పెళ్లి మండపంలో యువతి రచ్చ: చితక బాదిన వరుడి బంధువులు

Published : Apr 15, 2022, 12:51 PM ISTUpdated : Apr 15, 2022, 12:55 PM IST
ఖమ్మం పెళ్లి మండపంలో యువతి రచ్చ: చితక బాదిన వరుడి బంధువులు

సారాంశం

తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకొంటున్నాడని ప్రియుడు వివాహం చేసుకొనే పెళ్లి మండపం వద్ద ఓ యువతి రచ్చ చేసింది. ప్రియుడి బంధువులు యువతిని చితకబాదారు ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకొంది. 

ఖమ్మం: తనను ప్రేమించి మరో యువతితో Marriage చేసుకొంటున్నాడని పెళ్లి మండపంలో ఓ Woman నానా హంగామా చేసింది. తన Lover పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో యువకుడి బంధువులు ఆ యువతిని Function Hall నుండి ఈడ్చుకొంటూ  బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Khammam  పట్టణంోని ఓ పెళ్లి మండపంలో ఇవాళ పెళ్లి జరుగుతుంది. Srinath అనే యువకుడు వివాహం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఓ యువతి పెళ్లి మండపానికి వచ్చి నానా హంగామా చేసింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన యువతి తనతో కాకుండా మరో యువతిని శ్రీనాథ్ పెళ్లి చేసుకొంటున్నాడని మండిపడింది. మండపంలో రచ్చ చేసింది. పెళ్లి జరిగే సమయంలో ఈ యువతి ఎంటర్ కావడంతో షాక్ కు గురైన యువకుడి బంధువులు యువతిని చితకబాదారు.  పెళ్లి మండపం నుండి యువతిని ఈడ్చుకొంటూ బయటకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్