బాలింతల మృతిలాంటి ఘటనలు రిపీటైతే కఠినచర్యలు.. వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు హెచ్చరిక..

By SumaBala BukkaFirst Published Jan 30, 2023, 7:28 AM IST
Highlights

రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇబ్బందులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు హెచ్చరికలు జారీ చేశారు. 

హైదరాబాద్ : ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం హైదరాబాదులో వైద్య ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక 2022ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైద్యులు సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్రతను బట్టి డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడమని అన్నారు. ఈ సందర్భంగా మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతల మృతి ఘటనను గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అన్నారు. అలా జరిగినట్లైతే బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఆ తర్వాత ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.  విలేకరులతో మాట్లాడారు. నిరుడు వైద్య ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఒకటి రెండు ఘటనలు  ఇబ్బందికరంగా మారాయి కానీ.. మిగతా అంతా బాగానే ఉందని చెప్పారు. తాము ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్…టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదంతో ముందుకు పోతున్నామని తెలిపారు.  వైద్య ఆరోగ్య శాఖకు  రాష్ట్ర ప్రభుత్వం 2022 23 ఆర్థిక సంవత్సరంలో..రూ.11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు.  ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచామని తెలిపారు.

బీఆర్ఎస్ బహిరంగ సభ.. నాందేడ్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నేతలు

ఇక నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పదేపదే పేర్కొనే డబ్బులు ఇంజన్ సర్కారున్న ఉత్తర ప్రదేశ్ నీతి అయోగ్రాంకుల్లో చివరి స్థానంలో నిలిచిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చార్జ్ షీట్ విడుదల చేసి, హడావుడి చేసిందని.. ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛతీస్ఘడ్, హిమాచల్ ప్రదేశ్ లు వైద్యరంగంపై నీతి ఆయో విడుదల చేసిన సూచీలు ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోవాలన్నారు. ఆ రాష్ట్రాలు వరుసగా 16, 10, ఏడవ స్థానాల్లో నిలిచాయని.. ఆ విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లు ఉందని విమర్శలు గుప్పించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని 50 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు.  అందువల్లే  అక్కడక్కడ కొన్ని సంఘటనలు, అనారోగ్యం బారిన పడటం జరుగుతుందని  చెప్పుకొచ్చారు.

మిడ్ వైఫరీ వ్యవస్థ..
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందని.. మిడ్ వైఫరీ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ మిడ్ వైఫరీ సేవలను యూనిసెఫ్ కూడా ప్రశంసిందని  చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో  హైరిస్క్ గర్భిణులను గుర్తించి.. సంరక్షించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఇలాంటి ఎన్నో అవార్డులను పొందిందని ఈ సందర్భంగా  చెప్పారు.

click me!