బైక్ విషయంలో వివాదం .. నడిరోడ్డుపై కొట్టుకున్న యువకులు, కొత్తగూడెంలో టెన్షన్ టెన్షన్

Siva Kodati |  
Published : Aug 15, 2023, 04:16 PM IST
బైక్ విషయంలో వివాదం .. నడిరోడ్డుపై కొట్టుకున్న యువకులు, కొత్తగూడెంలో టెన్షన్ టెన్షన్

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ యువకులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఒక బైక్ విషయంలో చెలరేగిన గొడవ గ్యాంగ్ వార్‌కు దారితీసింది. యువకుల ఘర్షణతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ యువకులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వీరు ఘర్షణకు దిగారు. నడిరోడ్డుపై మైనర్ యువకులు పరస్పరం దాడికి దిగారు. ఒక బైక్ విషయంలో చెలరేగిన గొడవ గ్యాంగ్ వార్‌కు దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ రోడ్డుపై పరుగులు తీశారు. దీంతో స్థానిక పోస్టాఫిస్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గ్యాంగులను పట్టుకునే పనిలో పడ్డారు. వీరిలో చాలా మంది తప్పించుకుని పారిపోగా.. మరికొంతమంది దొరకడంతో స్టేషన్‌కు తరలించారు. యువకుల ఘర్షణతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu