చేప ఆకారంలో శిశువు జననం... పుట్టిన కాసేపటికే..

Published : Mar 12, 2021, 07:54 AM IST
చేప ఆకారంలో శిశువు జననం... పుట్టిన కాసేపటికే..

సారాంశం

 జన్యు లోపం కారణంగా శిశువు అలా జన్మించింది. అయితే.. పుట్టిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. 

ఓ మహిళ వింత ఆకారంతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. చేప ఆకారాంలో శిశువు జన్మించడం గమనార్హం. జన్యు లోపం కారణంగా శిశువు అలా జన్మించింది. అయితే.. పుట్టిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. 

ఈ సంఘటన హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రాత్రి జరిగింది. సంగారెడ్డికి చెందిన తహసీన్‌ సుల్తానా (20), మహ్మద్‌ ఆరీఫ్‌లు దంపతులు. ఈ నెల 5న తహసీన్‌ సుల్తానా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. 

ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు కాళ్లు అతుక్కుని చేప రూపంలో శిశువు జన్మించింది. విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగమణికి తెలిపారు. వైద్య చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు ఆ శిశువు మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?