భైంసా అల్లర్లు: స్పందించిన డీజీపీ ... మహిళా భద్రతా విభాగానికి దర్యాప్తు బాధ్యతలు

By Siva KodatiFirst Published Mar 11, 2021, 9:24 PM IST
Highlights

భైంసాలో లైంగిక దాడి ఉదంతంపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు మహిళా భద్రతా విభాగానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

భైంసాలో లైంగిక దాడి ఉదంతంపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు మహిళా భద్రతా విభాగానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, భైంసా అల్లర్లపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 21 కేసులు నమోదు చేశారు. అల్లర్లకు సంబంధించి 30 మంది అరెస్ట్‌ చేశారు. పోలీసుల అదుపులో మరో 21 మంది అనుమానితులున్నట్లు సమాచారం.

ఆదివారం రాత్రి జిల్లాలోని భైంసా పట్టణకేంద్రంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఘటన జరిగిన రెండు, మూడు గంటల్లోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి.

పోలీసు ఉన్నతాధికారులంతా భైంసాకు చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సంఘటన జరిగిన వీధులను దిగ్భంధించి బందోబస్తు చర్యలు ఉధృతం చేశారు. అలాగే పట్టణంలోకి కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా డ్రోన్‌ కెమెరాలతో అన్ని వీధులపై నిఘా పెట్టారు. 

మరోవైపు నిర్మల్‌ జిల్లా భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదివారం బీజేపీ ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి ఆర్వింద్‌తో పాటు పలువురు నేతలు ఆదివారం డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని.. స్థానిక సీఐని బదిలీ చేయాలని కోరారు. 

click me!