నర్సింగ్ విద్యార్థులకు ష్టైఫండ్ పెంపు: కేసీఆర్

By narsimha lodeFirst Published Jul 4, 2021, 5:17 PM IST
Highlights

 నర్సింగ్  విద్యార్థులకు  స్టైఫండ్ ను పెంచుతున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

హైదరాబాద్: నర్సింగ్  విద్యార్థులకు  స్టైఫండ్ ను పెంచుతున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులకు రూ. 5 వేలు, రెండో సంవత్సరం నర్సింగ్ విద్యార్థులకు రూ. 6 వేలు, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 7 వేలు స్టైఫండ్ ఇస్తామన్నారు. వచ్చే విడతలో రాజన్న సిరిసిల్లకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్రంలో చేపడుతామని ఆయన వివరించారు.

also read:57 ఏళ్లు నిండినవారికి వృద్దాప్య పెన్షన్: కేసీఆర్

రాజన్న సిరిసిల్లకు ఆదాయం పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తామని ఆయన తెలిపారు.  ఎస్సీల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ. 45 వేల కోట్లను దళితుల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆరేళ్లలో  వ్యవసాయరంగంలో అనేక అద్భుతాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.


 

click me!