అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేసన్ పరిధిలోని కొత్తగూడ బ్రిడ్జికి సమీపంలో జరిగిన జంట హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.
హైదరాబాద్: Abdullahpurmet జంట హత్యల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. యశ్వంత్, జ్యోతిలను హత్య చేసేందుకు శ్రీనివాసరావు సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకొన్నాడని పోలీసులు గుర్తించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని Kothagudem వద్ద బ్రిడ్జికి సమీపంలో Yashwanth, జ్యోతిని చంపేందుకు శ్రీనివాసరావు సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకొన్నాడు. సుఫారీ గ్యాంగ్ తో కలిసి శ్రీనివాసరావు ఈ హత్యలో పాల్గొన్నాడు.
undefined
హైద్రాబాద్ నగరంలోని వారాసీగూడకు చెందిన యశ్వంత్ కు అదే ప్రాంతానికి చెందిన వివాహిత Jyothiతో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధం విషయం తెలిసిన భర్త శ్రీనివాసరావు వీరిద్దరిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. యశ్వంత్, జ్యోతిని హత్య చేయాలని శ్రీనివాసరావు సుఫారీ గ్యాంగ్ కు డబ్బులు ఇచ్చాడు.
ఈ నెల 1వ తేదీన warasigudaనుండి యశ్వంత్, జ్యోతి లు కొత్తగూడ బ్రిడ్జి వద్దకు ఏకాంతంగా గడిపేందుకు వచ్చారు. అయితే వీరిని హత్య చేసేందుకు శ్రీనివాసరావు ఇచ్చిన సుఫారీ గ్యాంగ్ ఈ జంటను ఫాలో అయింది.ఈ విషయమై సుఫారీ గ్యాంగ్ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చింది. ఈ గ్యాంగ్ తో కలిసి శ్రీనివాసరావు కూడా కొత్తగూడ ప్రాంతానికి వచ్చాడు.
జ్యోతి కళ్లేదుట యశ్వంత్ ను అత్యంత దారుణంగా హత్య చేశాడు.చిత్ర హింసలు పెట్టి యశ్వంత్ ను హత్య చేశారు. ఆ తర్వాత జ్యోతిని కూడా చంపారు. అయితే తనను చంపొద్దని జ్యోతి బతిమిలాడింది. అయినా కూడా వినకుండా జ్యోతిని హత్య చేశారు.
కొత్తగూడ బ్రిడ్జి వద్ద ఓ గీత కార్మికుడు కల్లు గీసే సమయంలో యశ్వంత్,జ్యోతిలు హత్యకు గురైన ప్రాంతంలో టూ వీలర్ ను గుర్తించాడు. ఈ బైక్ వద్దకు గీత కార్మికుడు వచ్చిన సమయంలో దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడడంతో రెండు మృతదేహాలు కన్పించాయి.దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు నిన్న సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో బైక్ ను యశ్వంత్ దిగా గుర్తించారు. హత్య ప్రదేశంలోని హ్యాండ్ బ్యాగ్ లో దొరికిన చెప్పుల రశీదు ఆధారంగా మృతురాలిని జ్యోతిగా గుర్తించారు. వీరిద్దరూ కూడా వారాసీగూడకు చెందినవారేనని పోలీసులు తెలిపారు.
యశ్వంత్ తో కలిసి జ్యోతి గతంలో కూడా కొత్తగూడ బ్రిడ్జికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చి ఏకాంతంగా గడిపారు ఈ విషయం తెలుసుకొన్న శ్రీనివాసరావు జ్యోతిని మందలించాడు. పద్దతిని మార్చుకోవాలని కూడా హెచ్చరించాడు. కానీ ఆమె పద్దతిని మార్చుకోలేదు. ఈ నెల 1వ తేదీన యశ్వంత్ తో జ్యోతి ఏకాంతంగా ఉన్న సమయంలో సుఫారీ గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీనివాసరావులు అక్కడికి చేరుకొని చంపారు.