అచ్చు సూర్య సినిమానే: శంషాబాద్ లో కడుపులో క్యాప్సూల్స్ లో డ్రగ్స్‌తో ప్రయాణీకుడి అరెస్ట్

By narsimha lode  |  First Published May 4, 2022, 1:04 PM IST

హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు డ్రగ్స్ ను సీజ్ చేశారు. క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్ తరలిస్తున్న ప్రయాణీకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడికి ఆపరేషన్ చేసి 108 క్యాప్సూల్స్ ను కడుపు నుండి బయటకు తీశారు.


హైదరాబాద్: Hyderabad శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి డ్రగ్స్ ను పట్టుకొన్నారు అధికారులు,. సినిమాలో చూపినట్టుగానే క్యాప్యూల్స్ రూపంలో Drugsను తరలిస్తున్న ప్రయాణీకుడిని  ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఆరు రోజులు  ఆపరేషన్ చేసి 108 డ్రగ్స్ నింపిన క్యాప్సూల్స్ ను అధికారులు సీజ్ చేసుకున్నారు.

దక్షిణాప్రికాలోని జోహాన్స్‌బర్గ్ నుండి Shamshabad ఎయిర్ పోర్టుకు ఓ ప్రయాణీకుడు వచ్చాడు. కడుపులో క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్ తరలిస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు.ఆరు రోజుల పాటు అతడికి శస్త్రచికిత్స నిర్వహించి అతడి కడుపులో ఉన్న 108 డ్రగ్స్ క్యాప్సూల్స్ ను వెలికి తీశారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 11.58 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.సీజ్ చేసిన డ్రగ్స్ 1,390 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు హెరాయిన్ ను క్యాప్సూల్స్ రూపంలో తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు.

Latest Videos

undefined

తమిళ సినీ నటుడు నటించిన ఓ సినిమాను పలు భాషల్లో విడుదల చేశారు.ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. డ్రగ్స్ దందా నేపథ్యంలో ఈ సినిమా సాగింది.ఈ సినిమాలో డ్రగ్స్ దందా చేసే వారు క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్ ను తరలిస్తారు. ఈ సినిమాలో చూపినట్టుగానే జోహన్స్‌బర్గ్ నుండి వచ్చిన నిందితుడు క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్ తీసుకొని శ్ంషాబాద్ లో పట్టుబడ్డాడు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు. 

ఈ నెల 2వ తేదీన శంషాబాద్  అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఇద్దరు ప్రయాణీకుల నుండి  8 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు డీఆర్ఐ అధికారులు,. ఈ డ్రగ్స్ విలువ రూ. 80 కోట్లు ఉంటుందని చెప్పారు డీఆర్ఐ అధికారులు. టూరిస్ట్ వీసాపై హైద్రాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి డీఆర్ఐ  అధికారులు ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు.టాంజానియా, అంగోలాకు చెందిన ఇద్దరు ప్రయాణీకుల నుండి ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు.సూట్ కేసుల్లో సీక్రెట్ గా డ్రగ్స్ ను తీసుకు వస్తున్న సమయంలో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

టాంజానియా నుండి వచ్చిన ఓ పురుషుడు, ఆంగోలా నుండి వచ్చిన మహిళా ప్రయాణీకురాలి నుండి  ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. టాంజానియా జాతీయుడు కప్ టౌన్ నుండి దుబాయ్ మీదుగా హైద్రాబాద్ కు వ్యాపార వీసాపై వచ్చారు.  అంగోలా నుండి మహిళా ప్రయాణీకురాలు  మొజాంబిక్ లుసాకా దుబాయ్ హైద్రాబాద్ కి చేరుకొన్నారు. నాలుగు కిలోల చొప్పున ఒక్కో ప్రయాణీకుడు తమ సూట్ కేసుల ట్రాలీ బ్యాగు అడుగు భాగంలో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు రద్దు చేయడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ పెరిగిపోయాయి.

ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ ప్రయాణీకుడి నుండి 1.15 కిలోల కొకైన్ ను హైద్రాబాద్ లో స్వాధీనం చేసుకొన్నారు. మరో కేసులో గత ఏడాది ఆగష్టులో బెంగుళూరులో ఓ ప్రయాణీకుడిని కిలో కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారుతెలంగాణలో డ్రగ్స్  పై తెలంగాణ సర్కార్ గట్టి చర్యలు తీసుకొంటుంది. డ్రగ్స్ సరపరా చేసే వారితో పాటు డ్రగ్స్ తీసుకొనే వారిపై కూడా కసులు నమోదు చేస్తున్నారు.

 

click me!