బ్యూటీషియన్ శిరీష కేసులో శ్రావణ్ డబుల్ రోల్

Published : Jun 22, 2017, 12:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బ్యూటీషియన్ శిరీష కేసులో శ్రావణ్ డబుల్ రోల్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష మరణంపై చిక్కు ముళ్లు విప్పుతున్నారు పోలీసులు. ఆమెతోపాటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో శ్రావన్ డబుల్ రోల్ పోశించారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాజీవ్, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఇద్దరి సమస్యలు తీర్చేందుకు శ్రావణ్ ఆపద్భాందవుడి అవతారమెత్తినట్లు భావిస్తున్నారు పోలీసులు. శిరీషను ఎరగా వాడుకోవాలన్న ఉద్దేశంతోనే శ్రావన్ పావులు కదిలిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజీవ్, ఎస్సై ప్రభాకర్ రెడ్డి, శిరీష్ ముగ్గురికీ శ్రావణ్ కామన్ ఫ్రెండ్. ఈ స్నేహం అడ్డుగా పెట్టుకుని తన ప్లాన్ ఈజీగా అమలు చేయవచ్చని శ్రావణ్ భావించినట్లు చెబుతున్నారు పోలీసులు. శిరీషను వదిలించుకోవడం రాజీవ్ లక్ష్యం కాగా, శిరీషను ఎరగా వేసి ఎస్సై ప్రభాకర్ రెడ్డిని తన ప్రయోజనాల కోసం వాడుకోవడం శ్రావన్ ఉద్దేశం అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే వారిద్దరి సమస్యలను తీర్చేందుకు తాను పనిచేస్తున్నట్లు రాజీవ్ ను, ఎస్సై ని నమ్మించే ప్రయత్నం చేశాడు శ్రావణ్.

 

నాలుగేళ్లుగా తనతో కలిసి ఉన్న శిరీషను వదిలించుకోవడం రాజీవ్ లక్ష్యం. ఆ సమస్య పరిష్కారానికి నేను సహకరిస్తానని రాజీవ్ కు భరోసా ఇచ్చాడు శ్రావణ్. ఇందుకోసం ఎస్సైకి మనం చిన్న సాయం చేస్తే సరిపోతుందంటూ రాజీవ్ కు చెప్పాడు. తన నుంచి శిరీష విడిపోతే వెంటనే తేజస్వినిని పెళ్లి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఉన్న రాజీవ్ వెంటనే ఎస్సైకి ఏ సాయం చేయడానికైనా చేయించడానికైనా నేను రెడీ అని శ్రావణ్ తో చెప్పినట్ల పోలీసులు అంటున్నారు.

 

మరోవైపు ఎస్సై ప్రభాకర్ రెడ్డికి పదేపదే శిరీష అందచందాలపై చెబుతూ ఆయనలో లేని ఆశలు రేకెత్తించినట్లు పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్ లో లీడింగ్ బ్యూటీషియన్ ను నీ వద్దకు తీసుకొస్తున్నాను అంటూ ఎస్సైకి చెప్పి ఆ దిశగానే ప్లాన్ అమలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

 

ఎస్సై ప్రభాకర్ రెడ్డితో శ్రావణ్ ఎన్నిసార్లు మాట్లాడారు? ఏం మాట్లాడారన్నదానిపై వివరాలు సేకరిస్తున్నారు. శిరీషను నీదగ్గరికి తీసుకొస్తా, ఆమె మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు చూసిన తర్వాత డిషిషన్ తీసుకో అన్న అని శ్రావన్ ఫోన్ లో ఎస్సైకి వివరించిన మాటలను సేకరించారు పోలీసులు.

 

ఇక శిరీషను వదిలించుకునేందుకు సద్ధపడిన రాజీవ్ వెంటనే శ్రావణ్ చెప్పినదానికి ఓకె చెప్పేశాడు. అందుకే రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి లిక్కర్, స్నాక్స్ కొనుగోలు చేసి కుకునూరుపల్లికి ముగ్గురు కలిసి బయలుదేరారు. అక్కడికి వెళ్లిన తర్వాత మద్యం సేవించడం, ఆ తర్వాత సిగరేట్ తాగే నెపంతో రాజీవ్ ను తీసుకుని ఎస్సై గదిలోనుంచి బయటకు రావడం, ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న ఎస్సై శిరీష పై అత్యాచార యత్నం చేయబోవడం ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయని పోలీసులకు సమాచారం లభించింది.

 

మొత్తానికి శ్రావణ్ తన స్వప్రయోజనాల కోసమే ఇటు రాజీవ్, అటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, మరోవైపు శిరీషను వాడుకోవాలని భావించడం కారణంగానే రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసి  పోయాయని పోలీసు వర్గాలు  చెబుతున్నాయి. ఈ కేసులో మరింత సమాచారం కోసం పోలీసులు ప్రధాన నిందితుడైన శ్రావణ్ ను మరికొద్ది రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వారి కస్టడీకి తీసుకున్న తర్వాత శ్రావణ్ తాలూకు మరిన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే