బాల్యం నుంచి లీడర్ దాకా: కేటీఆర్‌ బర్త్‌డేకి అరుదైన కానుక

Siva Kodati |  
Published : Jul 24, 2020, 08:20 PM IST
బాల్యం నుంచి లీడర్ దాకా: కేటీఆర్‌ బర్త్‌డేకి అరుదైన కానుక

సారాంశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు టీఆర్ఎస్ నేత, ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ఓ అపురూపమైన కానుకను అందించారు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు టీఆర్ఎస్ నేత, ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ఓ అపురూపమైన కానుకను అందించారు.

 

"

 

కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ కెరియర్, విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని వివరిస్తున్న దృశ్యమాలికలతో శ్రీనివాస్ ఓ పెయింటింగ్‌ను వేయించారు. సామాజిక అంశాలపై పెయింటింగ్స్ వేసే కందుకూరి వెంకటేశ్‌ దీనిని వేశారు.

Also Read:నీతో గడిపిన రోజులు మరవలేను.. కేటీఆర్ కి సెలబ్రెటీల విషెస్

ఈ భారీ పెయింటింగ్‌లో కేసీఆర్ లాంతర్‌తో ధైర్యంగా నడుస్తుంటే వెనకాలే కేటీఆర్ నవ్వుతూ నడుస్తున్నట్లు, అంధకారం నుంచి వెలుగులను కేటీఆర్‌ చూస్తున్నట్లు, మెట్రో పరుగులు, ఐటీ హంగుల మేళవింపు, ఇన్ఫ్మరేషన్, విజన్, అకౌంటబులిటీ అనే పదాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తన కుమారులతో ప్రగతి భవన్‌లో అందించారు. తనపై చూపిన అభిమానానికి కేటీఆర్.. ఉప్పలను ధన్యవాదాలు తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu