కేసీఆర్ సెంటిమెంటు, నూతన సచివాలయం అంతా "6"మయం

By Sreeharsha GopaganiFirst Published Jul 24, 2020, 8:07 PM IST
Highlights

కేసీఆర్ సెంటిమెంట్ల సంగతి అందరికి తెలిసిందే. ఆయన కార్ నంబర్లు సైతం అన్నీ 6666 లే. ఆయనకు ఆరుపై మమకారం ఎక్కువ. తన లక్కీ నెంబర్ 6 గా విశ్వసిస్తారు కేసీఆర్. 

తెలంగాణాలో నూతన సచివాలయ నిర్మాణం త్వరలో ప్రారంభమవనుంది. పాత సచివాలయం కూల్చివేత దాదాపుగా పూర్తయిపోయింది. మరో 5 నుంచి 10 శాతం మాత్రమే మిగిలి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో అంతా కూడా నూతనంగా నిర్మించబోయే సచివాలయం ఎలా ఉండొచ్చు అంటూ అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన డిజైన్ అందరిని ఆకర్షిస్తుంది కూడా. 

ఇకపోతే కేసీఆర్ సెంటిమెంట్ల సంగతి అందరికి తెలిసిందే. ఆయన కార్ నంబర్లు సైతం అన్నీ 6666 లే. ఆయనకు ఆరుపై మమకారం ఎక్కువ. తన లక్కీ నెంబర్ 6 గా విశ్వసిస్తారు కేసీఆర్. 

నూతనంగా నిర్మించే సచివాలయం కూడా అంతా 6ల మయంగానే ఉండబోతుంది. సచివాలయం మొత్తం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘నిర్మితమవుతుంది. మరో అంశం ఏమిటంటే సెక్రటేరియట్ భవనం కూడా 6 అంతస్థుల్లో  నిర్మించనున్నారు. ఇక సచివాలయం చుట్టూ రోడ్లను సైతం 60 అడుగుల వెడల్పు ఉండేవిధంగా అభివృద్ధి చేయనున్నారు. 

ఇక ఈ నూతన  సెక్రటేరియట్ భవనంలో 6 కాన్ఫరెన్స్స హాళ్లు, 6 డైనింగ్ హాళ్లు, 6 పార్కులు ఉండనున్నాయి. గుమ్మటం సైతం 60 మీటర్ల ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. కేసీఆర్ 6సెంటిమెంటును సచివాలయంలో కూడా కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ఇంకా పూర్తి స్థాయి డిజైన్ ఆమోదం పొందలేదు. ఆ డిజైన్ పూర్తి నిర్మాణం పూర్తయ్యాక మాత్రమే ఈ విషయం తెలియవచ్చే ఆస్కారం ఉంది. కానీ అందుతున్న సమాచారం మేరకు మాత్రం ఈ 6 కాన్సెప్ట్ తోనే నిర్మాణం చేపట్టనున్నట్టు తెలియవస్తుంది. 

ఇకపోతే.... తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను కవరేజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించబోవడంలేదు అనే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం శుక్రవారం నాడు తెలిపింది. ఈ విషయమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కవరేజీకి అనుమతివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీపై శుక్రవారం నాడు కూడ హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై మీడియాకు అనుమతివ్వకపోవడం అనుమానాలకు దారితీస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ప్రాంతాల నుండి కవరేజ్ ను ఎందుకు అడ్డుకొంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

అనంత పద్మనాభస్వామి ఆలయ సందప కవరేజీపై ఆంక్షలు లేవనే విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వ నిర్ణయం చూసి రేపు ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొంటామని కోర్టు తెలిపింది. 

చివాలయం కూల్చివేతల ప్రత్యక్ష కవరేజీకి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ పిటిషన్ కు చట్టబద్దంగా ఎలాంటి అర్హత లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. ఈ పిటిషన్ కు ఎందుకు అర్హత లేదో చెప్పాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు కోరింది.

click me!