మణిపూర్ హింస.. విద్యార్థుల రాక ఆలస్యం, రేపు ఉదయం శంషాబాద్‌కు ప్రత్యేక విమానం..?

Siva Kodati |  
Published : May 07, 2023, 07:44 PM ISTUpdated : May 07, 2023, 07:46 PM IST
మణిపూర్ హింస.. విద్యార్థుల రాక ఆలస్యం, రేపు ఉదయం శంషాబాద్‌కు ప్రత్యేక విమానం..?

సారాంశం

మణిపూర్ నుంచి తెలంగాణ విద్యార్ధుల రాక ఆలస్యం కానుంది. అనివార్య కారణాల వల్ల సోమవారం ఉదయం విద్యార్ధులతో కూడిన స్పెషల్ ఫ్లైట్ శంషాబాద్‌కు రానుంది.

మణిపూర్ నుంచి తెలంగాణ విద్యార్ధుల రాక ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రానికి ఇంఫాల్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రావాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల సోమవారం ఉదయం విద్యార్ధులతో కూడిన స్పెషల్ ఫ్లైట్ శంషాబాద్‌కు రానుంది. ఇంఫాల్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం చేరుకోనుందని ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. మరోవైపు మణిపూర్ ప్రభుత్వం సోమవారం మూడు గంటల పాటు కర్ఫ్యూను సడలించింది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు తెలిపింది. ఇక్కడ చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఈ అవకాశం కల్పించింది. 

కాగా.. మణిపూర్ లో ఉద్రిక్త‌ పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడంతో తెలంగాణ విద్యార్థులను, ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో నివసిస్తున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. మే 7న ఇంఫాల్ విమానాశ్రయం నుంచి తెలంగాణ విద్యార్థులు, స్థానికులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.

ALso Read: మణిపూర్ హింస : హెల్ప్‌డెస్క్‌లు, స్పెషల్ ఫ్లైట్స్‌తో పౌరుల తరలింపు, ఏ రాష్ట్రం ఎలాంటి ఏర్పాట్లు చేసిందంటే..?

మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజల కోసం 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. సంబంధిత వివ‌రాల‌ను డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సహాయం అవసరమైన వారు సహాయం కోసం 7901643283 లేదా ఇమెయిల్ ద్వారా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐపీఎస్-డీఐజీ) సుమతిని సంప్రదించవచ్చని ఆయన తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు.

మణిపూర్ హింసాత్మక ఘర్షణల్లో 54 మరణించారు..

మ‌ణిపూర్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే, శనివారం (మే 6) ఇంఫాల్ లోయలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడంతో, దుకాణాలు, మార్కెట్లు తెరుచుకోవడం, కార్లు రోడ్లపై తిరగడం క‌నిపించింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప‌రిస్థితులు దారుణంగానే ఉన్నాయి. మణిపూర్ ను చుట్టుముట్టిన జాతి హింసలో మరణించిన వారి సంఖ్య 54కు పెరిగింది. అనధికారిక వర్గాల నివేదిక‌ల ప్రకారం.. మ‌ణిపూర్ హింసాకాండలో మృతుల సంఖ్య వందకు పైగా ఉంటుంద‌ని స‌మాచారం. గాయపడిన వారి సంఖ్య దాదాపు 200పైగా ఉంది. ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనాలనీ, జాతి వర్గాల మధ్య చర్చలు జ‌ర‌గాల‌ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?