ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని బెదిరించిన చిట్టాపూర్ బీజేపీ అభ్యర్ధి మణికంఠ రాథోడ్ పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించిన చిట్టాపూర్ బీజేపీ అభ్యర్ధి మణికంఠ రాథోడ్ ను ఆ పార్టీ నుండి బహిష్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలోని చిట్టాపూర్ బీజేపీ అభ్యర్ధి మణికంఠ రాథోడ్ పై జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని చిట్టాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నాడని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోసారి ఇదే స్థానం నుండి ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రియాంక్ ఖర్గేపై పోటీకి నిలిపేందుకు అభ్యర్ధి దొరకక రౌడీ షీటర్ ను బీజేపీ బరిలోకి దింపిందని రేవంత్ రెడ్డి చెప్పారు. మణికంఠ రాథోడ్ పై30 కేసులున్నాయని ఆయన ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని అంతం చేస్తానని మణికంఠ రాథోడ్ వ్యాఖ్యలు బయటకు వచ్చాయన్నారు.ఈ విషయమై ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
హైద్రాబాద్ లో గాడ్సే ఫోటో ప్రదర్శించిన వారిపై ఏం చర్యలు తీసుకొన్నారని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో బ్యాంకులను జాతీయ చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసిన ఇందిరా గాంధీ మనమరాలు ప్రియాంక గాధీ కాళ్లు మొక్కి క్షమాపణలు కోరాలని కేటీఆర్ కు సూచించారు రేవంత్ రెడ్డిప్రియాంక గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్టుగా కేటీఆర్ పేర్కొనడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రియాంక గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్టుగా కేటీఆర్ పేర్కొనడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. . పార్లమెంట్ లో అనేక కీలక బిల్లులకు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. గాడ్సేకు మద్దతిచ్చే పార్టీతో బీఆర్ఎస్ అంటకాగిందని ఆయన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ కలిసే ఉన్నాయన్నారు.
అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో మహారాష్ట్ర నుండి తీసుకువచ్చిన వ్యక్తికి నెలకు రూ. 1.60 లక్షలతో కేసీఆర్ ఉద్యోగం కట్టబెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగాల కోసం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోతుందని కేసీఆర్ సర్కార్ పై ఆయన విమర్శలు చేశారు.మరో వైపు టెన్త్ క్లాస్ , టీఎస్‌పీఎస్ సీ పేపర్లు లీకయ్యాయన్నారు. ఇంటర్ పేపర్లు సరిగా వాల్యూయేషన్ చేయని కారణంగా 26 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.