మందలించాడని.. తండ్రిని హత్య చేసిన కొడుకు !!

Published : Apr 17, 2021, 10:49 AM IST
మందలించాడని.. తండ్రిని హత్య చేసిన కొడుకు !!

సారాంశం

చిన్న చిన్న విషయాలతో అతి కిరాతకంగా హత్యలు చేయడం మామూలుగా మారిపోతోంది. తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్య చేసుకోవడమో.. లేదా వారినే హత్య చేయడమో చేస్తున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మానవత్వం మంట గలుస్తూ... బంధాలు బీటలు వారుతున్నాయి.

ఇలాంటి దారుణ ఘటన ఒకటి సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో  జరిగింది. తండ్రి మందలించాడని అతి కిరాతకంగా హతమార్చాడో కర్కశ కొడుకు. వివరాల్లో వెడితే.. 

గ్రామానికి చెంది అంజిరెడ్డి నంద్యాల కొడుకు సమరసింహారెడ్డి కొన్ని రోజులుగా జులాయిగా తిరుగుతున్నాడు. జులయిగా ఎందుకు తిరగడం, ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అని తండ్రి కొడుకును మందలించాడు.

తండ్రి మాటలకు కొడుకు సమరసింహారెడ్డి కోపానికి వచ్చాడు. ఆ మాటలను తట్టుకోలేక సహనం కోల్పోయి శుక్రవారం అర్ధరాత్రి తండ్రిని హతమార్చాడు. ఈ ఘటన నారాయణ గూడెంలో చోటుచేసుకుంది.

ఉదయం విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం