Siddipet: పరీక్ష రాసి వస్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం.. ఎనిమిది మంది సీరియస్‌..

By Rajesh Karampoori  |  First Published Sep 13, 2023, 4:21 AM IST

సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో ఆగి  ఉన్న ఇసుక లారీని క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాద స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది సీరియస్‌గా ఉన్నారు.


Siddipet: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చిన్నకోడూరు మండలం అనంత సాగర్ శివారులో రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన విద్యార్థులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నితిన్, గ్రీష్మ, నమ్రత అనే ముగ్గురు విద్యార్థులు యాక్సిడెంట్ స్పాట్ లోనే మృతిచెందారు. ఇక చికిత్స పొందుతున్న తొమ్మిది మంది విద్యార్థుల పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Videos

వారిని సిద్దిపేట ఏరియా హాస్పిటల్‌ నుంచి హైదరాబాద్ యశోదకు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రవళిక, రోహిత్ రెడ్డి, నమ్రత, సాయి చరణ్, సాయి నితిన్, చైతన్య, కర్రెరాజు, చైతన్య అనే ఎనిమిది మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ తోటి దేవచంద్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులంతా కరీంనగర్ (Karimnagar)లోని తిమ్మాపూర్‌లో  పరీక్షలు రాసి.. సిద్దిపేటకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా సిద్దిపేట పట్టణంలోని ఇందూర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.  

click me!