వండర్ లాలో రైడ్స్ చేస్తుండగా హార్ట్ ఎటాక్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి....

By SumaBala Bukka  |  First Published Aug 15, 2023, 11:35 AM IST

సరదాగా స్నేహితులతో వండర్ లాకు వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి హర్ట్ ఎటాక్ తో మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 


రంగారెడ్డి : హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా వండర్ లాలో ఆదివారంనాడు విషాద ఘటన చోటు చేసుకుంది. వండర్ లాలోని  రైడ్స్ చేస్తుండగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లా రావిర్యాల సమీపంలోని వండర్ లాలో చోటుచేసుకున్న ఈ ఘటన.. అక్కడికి వచ్చిన సందర్శకులను విషాదంలో ముంచింది. 

దీనికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మడి మనోజ్ కుమార్ (26) అనే యువకుడు  అనకాపల్లి జిల్లా కాశీంకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి  చెందిన వ్యక్తి. హైదరాబాదులోని కూకట్పల్లిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో.. స్నేహితులు వరప్రసాద్, దుర్గాప్రసాద్, గణేష్, శ్రీకాంత్, ప్రశాంత్ లతో కలిసి సరదాగా వండర్లాకు  వెళ్ళాడు.

Latest Videos

రూ.37 వేల కోట్ల పంట రుణాలు మాఫీ: గోల్కోండకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

వీరంతా అక్కడ ఉన్న రైడ్స్ ను ట్రై చేశారు. మొదట జాయింట్ వీల్ ఎక్కారు. అది పూర్తయిన తర్వాత రోలర్ కోస్ట్ రైడ్ ఎక్కారు. ఆ సమయంలోనే మనోజ్ కుమార్ కు ఛాతిలో నొప్పి మొదలైంది. అది స్నేహితులకు చెప్పడంతో వెంటనే వండర్ లాలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ  అతడిని పరీక్షించి టాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టారు.

అయితే, మనోజ్ కుమార్ కు అప్పటికే పల్స్ రేట్ తగ్గిపోయింది.  మనిషి చల్లబడిపోయాడు. హార్ట్ బీట్ కూడా సరిగా లేదని స్నేహితులు గమనించేసరికి మనోజ్ కుమార్ ను అంబులెన్స్ లో యంజాల్ సమీపంలోని మహోనియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మనోజ్ కుమారును వైద్యులు పరీక్షించారు. వెంటనే పెద్దాస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.

దీంతో..  మహోనియా ఆస్పత్రి నుంచి గాంధీ హాస్పిటల్ కి మనోజ్ కుమార్ ను తరలించారు. గాంధీలో మనోజ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. దీనిమీద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  మనోజ్ కుమార్ మృతదేహానికి సోమవారం నాడు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

click me!