హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇన్ఫోపీ అనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇందులో మొత్తం 700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. 650 పేరుతో రూ.4 లక్షలు, 50 మంది పేరుతో రూ.10 లక్షలు చొప్పున కంపెనీ యాజమాన్యం లోన్ తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కారణంగా దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులు తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇన్ఫోపీ అనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది. దీంతో షాకైన ఉద్యోగులు.. గచ్చిబౌలిలోని ఇన్ఫోపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇందులో మొత్తం 700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. 650 పేరుతో రూ.4 లక్షలు, 50 మంది పేరుతో రూ.10 లక్షలు చొప్పున కంపెనీ యాజమాన్యం లోన్ తీసుకుంది. అయితే ఏడాదిన్నరగా ఉద్యోగులకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. జీతాలపై ప్రశ్నిస్తే దాట వేస్తూ వుండగా.. ఈ రోజు ఏకంగా బోర్డు తిప్పేడయంతో ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.