ఉదయం నీ వెంట.. రాత్రికి మరో నేత పక్కన, వాళ్లంతా నీ వాళ్లు కాదు : పొంగులేటిపై సండ్ర విమర్శలు

Siva Kodati |  
Published : Apr 18, 2023, 02:43 PM IST
ఉదయం నీ వెంట.. రాత్రికి మరో నేత పక్కన, వాళ్లంతా నీ వాళ్లు కాదు : పొంగులేటిపై సండ్ర విమర్శలు

సారాంశం

బీఆర్ఎస్ బహిష్కృత నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. రెండు జాతీయ పార్టీలు నీ కోసం ఎదురుచూడటం లేదని.. నువ్వే చూస్తున్నావంటూ వీరయ్య చురకలంటించారు.  

బీఆర్ఎస్ బహిష్కృత నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం మరో నేతతో కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. తీరా ఆ నాయకుడికి మాత్రం ఈ విషయం తెలియడం లేదని.. ఆయన సెటైర్లు వేశారు. విమర్శలే ధ్యేయంగా మీకు ఏ పని చేయకుండా వుండే వారికి ఓట్లు వేస్తారా అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నాయకులు అవసరమా అని నిలదీశారు. పార్టీ కోసం పనిచేసే వారిని సమర్ధించాలి కానీ.. వ్యక్తిగత ప్రయోజనం కోసం పనిచేసే వారిని సమర్ధించకూడాదని పొంగులేటి పేర్కొన్నారు. అలాంటి నాయకుల వల్ల పార్టీలు నాశనమవుతాయని సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. 

రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ప్రభుత్వాన్ని, నేతలను అసెంబ్లీ గేట్లు తాకనివ్వనని పొంగులేటీ అంటున్నారని.. మరి ఆయన చేసిన మంచి ఏంటని వీరయ్య ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే.. తాము వారి విశ్వాసం పొందుతున్నామని సండ్ర తెలిపారు. చౌకబారు విమర్శలు చేసే వారిని ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని పొంగులేటికి ఓట్లు వేయాలని సండ్ర నిలదీశారు. రెండు జాతీయ పార్టీలు నీ కోసం ఎదురుచూడటం లేదని.. నువ్వే చూస్తున్నావంటూ వీరయ్య చురకలంటించారు. జిల్లాలో అభ్యర్ధులను ప్రకటించి.. జాతీయ పార్టీలో చేరితే అవి నీకు మద్ధతు ఇస్తాయా అని సండ్ర నిలదీశారు. 

Also Read: వాళ్లను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను .. మళ్లీ గెలుస్తా : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్

కాగా..  బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థి. అందుకే ఆయనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసి ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు తెలిసింది. పొంగులేటి శ్రీనివాస్‌తో రాహుల్ గాంధీ టీమ్ సమావేశమై ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. సుమారు ఆరు గంటలపాటు పొంగులేటి నివాసంలోనే ఈ చర్చ జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి మారితే ఖమ్మంలో పార్టీ క్లీన్ స్వీప్ చేయవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, టీడీపీ ఇలా పార్టీలు ఇక్కడ దృష్టి పెట్టాయి. ఇక్కడి ఓటర్ల విభిన్న అభిప్రాయాలు, ఆలోచనల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఈ పార్టీలు ఫోకస్ పెట్టాయి. 

కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నది. ఇప్పటికే ఇక్కడ మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలంలో పోదెం వీరయ్యలు ఉన్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గంలో జావిద్, సత్తుపల్లి స్థానంలో సంబాని చంద్రశేఖర్, పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావులు ఉన్నారు. అయితే, పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే.. ఆయన చెప్పిన అభ్యర్థులనే ఈ స్థానాల్లో నిలబెట్టడానికి కాంగ్రెస్ సుముఖతను చూపినట్టు సమాచారం. మధిర, భద్రాచలం సీట్లు మినహా మిగితా స్థానాల్లో అభ్యర్థులపై పొంగులేటి నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!