Bilkis Bano Case : నేరస్తుల విడుదల వార్త విని నమ్మలేకపోయా.. షాక్ అయ్యా.. స్మితా సబర్వాల్

By Bukka SumabalaFirst Published Aug 19, 2022, 9:52 AM IST
Highlights

బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల మీద సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వారి విడుదల వార్త చదివి తాను చేష్టలుడిగిపోయానని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : Bilkis bano కేసులో దోషుల విడుదలపై ముఖ్యమంత్రి కార్యదర్శి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించారు.  ఆ వార్త చదివాక..  ఒక ఒక మహిళగా, ఒక సివిల్ సర్వెంట్గా దాన్ని నమ్మలేకపోయానని.. అలాగే కూర్చుండిపోయానని ఆమె ట్వీట్ చేశారు.  స్వేచ్ఛగా,  భయం లేకుండా జీవించడానికి ఆమెకు ఉన్న హక్కును మనం తిరస్కరించలేమని, అలా చేసి మనది స్వేచ్ఛాయుత దేశంగా చెప్పుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో దోషుల విడుదల నిరసిస్తూ bilkis bano విడుదల చేసిన ప్రకటనను స్మితా సబర్వాల్ పోస్ట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో దోషులను పంద్రాగస్టు నాడు విడుదల చేయడం ఏమిటని.. గుజరాత్ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, స్వాతంత్ర దినోత్సవానికే కళంకం అని అన్నారు.  జైలు నుంచి విడుదలైన అత్యాచార దోషులు, హంతకులను సన్మానించడం సభ్య సమాజానికి చెంపపెట్టు అని ఆగ్రహం వెలిబుచ్చారు.

సిగ్గ‌నిపించ‌డం లేదా?.. అత్యాచార నిందితులకు బీజేపీ మద్దతుపై ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

ఒక మహిళగా Bilkis bano బాధను, భయాన్ని తాను అర్థం చేసుకోగలనని కవిత ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ గురువారం మరోసారి స్పందించారు. ‘హేయమైన నేరానికి పాల్పడి జైలుకెళ్లిన దోషులను సన్మానించడానికి వాళ్లేమైనా యుద్ధ వీరులా? స్వాతంత్ర సమరయోధులా?’ అని ప్రశ్నించారు. నేడు Bilkis banoకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని దీనిపై దేశం స్పందించారని మంత్రి కేటీఆర్ కోరారు.

ఇక బిల్కిస్ బానో కేసు దోషుల విడుదల ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆమెకు న్యాయం చేయాలని ప్రదానికి విఙ్ఞప్తి చేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులను తిరిగి జైలుకు పంపాలని అన్నారు.   

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 17న గుజరాత్ లో 2002లో చోటుచేసుకున్న bilkis bano గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిషన్  విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై చిత్తశుద్ధి ఉంటే..  గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ ఆర్డర్ పై జోక్యం చేసుకోవాలని మోదీని కేటీఆర్ కోరారు. 

ఆ ఉత్తర్వులను రద్దు చేయించి, దేశం పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అసహ్యంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లో  తగిన సవరణలు చేసి రేపిస్టులకు  బెయిల్ రాకుండా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

click me!