వరంగల్ అన్నారంలో కారు బీభత్సం: దుకాణంలోకి దూసుకెళ్లిన కారు, ఆరుగురికి గాయాలు

Published : Jan 20, 2023, 09:55 AM IST
 వరంగల్ అన్నారంలో కారు బీభత్సం: దుకాణంలోకి దూసుకెళ్లిన  కారు, ఆరుగురికి గాయాలు

సారాంశం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం అన్నారంలో  దుకాణంలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా  ఉంది.

వరంగల్: ఉమ్మడి వరంగల్  జిల్లాలోని పర్వతగిరి మండలం  అన్నారంలో  శుక్రవారం నాడు  కారు   బీభత్సం సృష్టించింది.  అతి వేగంగా  వచ్చిన కారు  దుకాణంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు   ఆరుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.  గాయపడిన వారిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా  ఉందని  చెబుతున్నారు.  

కొత్తకారుకు  పూజ చేయించేందుకు  అన్నారం దర్గా వద్దకు  కారును తీసుకు వచ్చారు. పూజ కోసం తీసుకు వచ్చిన కారును  అతి వేగంగా నడపడం వల్ల  దర్గా వద్ద కారు కంట్రోల్  కాలేదు.  దర్గా వద్ద ఉన్న ఓ దుకాణంలోకి  కారు  దూసుకెళ్లింది.  దుకాణంలోకి దూసుకెళ్లే సమయంలో  అక్కడే  ఉన్న భక్తులను  ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్