రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థత, భవనం కూల్చివేసే చాన్స్

Published : Jan 20, 2023, 09:38 AM ISTUpdated : Jan 20, 2023, 09:41 AM IST
 రాంగోపాల్ పేట  అగ్ని ప్రమాదం: ఇద్దరు  ఫైర్ సిబ్బంది అస్వస్థత,  భవనం కూల్చివేసే చాన్స్

సారాంశం

సికింద్రాబాద్  రాంగోపాల్ పేట  డెక్కన్  నైట్ వేర్  స్టోర్  భవనాన్ని  ఇవాళో లేదో  రేపో  కూల్చివేయనున్నారు. ఈ భవనంలోని  సెల్లార్  లో మంటలు చెలరేగాయి. మంటలనుఆర్పే ప్రయత్నం చేసిన ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్: సికింద్రాబాద్   రాంగోపాల్ పేట డెక్కన్  నైట్ వేర్  స్టోర్   భవనాన్ని ఇవాళ లేదా  రేపు కూల్చివేసే అవకాశం ఉంది. ఈ భవనంలో  మంటలను నిన్న రాత్రి  8 గంటల సమయంలో  అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే  ఇవాళ ఉదయం నుండి భవనం సెల్లార్ లో  మంటలు మళ్లీ చెలరేగాయి. ఈ  మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.  జేఎన్‌టీయూ  ఇంజనీరింగ్ విభాగం  అధికారులు  ఇవాళ  ఉదయం  ఈ భవనాన్ని పరిశీలించనున్నారు. ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం మేరకు  ఈ   భవనాన్ని ఇవాళ లేదా రేపు  కూల్చివేయనున్నారు.  ఈ భవనంలోనికి ఎవరిని అనుమతించడం లేదు. 

ఈ భవన యజమాని  మహ్మద్, రహీంలపై పోలీసులు నిన్ననే కేసు నమోదుచేశారు.  రెసిడెన్షియల్  విభాగాన్ని కమర్షియల్ గా ఉపయోగిస్తున్నట్టుగా  అధికారులు గుర్తించారు.  అంతేకాదు  ఈ భవనం ఫైర్ నిబంధనలకు విరుద్దంగా  ఉందని అధికారులు గుర్తించారు. భవనంలో  మంటలకు అంటుకొనే  గుణం ఉన్న సింథటిక్, టైర్లు వంటి ఉండడం కూడా  మంటల తీవ్రత అధికంగా ఉండడానికి కారణంగా మారిందని అధికారులు  అభిప్రాయపడుతున్నారు.

also read:రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం : 40 ఫైరింజన్లు, గంటల పాటు శ్రమ.. ఎట్టకేలకు అదుపులోకి మంటలు

ప్రమాదం జరిగిన  భవనాన్ని తెలంగాణ మంత్రులు  మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు  పరిశీలించారు.  సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ భవనంలో  ఇంకా ముగురి ఆచూకీ తెలియడం లేదని భవన  యజమాని  తెలిపినట్టుగా  పోలీసులు  చెబుతున్నారు. అయితే  ఈ భవనం లోపలికి  వెళ్లి పరిశీలిస్తే  కానీ  అదృశ్యమైన వారి వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.  గంటల పాటు  మంటల్లో ఉన్నందున  ఈ భవనం  పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో  ఈ భవనం కుప్పకూలిపోయే అవకాశం ఉందని  అధికారులు అనుమానిస్తున్నారు.దీంతో ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ఇద్దరు ఫైర్ సిబ్బందికి అస్వస్థత

ఈ భవనంలోని సెల్లార్ లో  మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న  ఫైర్ సిబ్బందిలో  ఇవాళ మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏడీఎఫ్  ధనుంజయ్ రెడ్డి, ఫైర్ ఇంజన్ డ్రైవర్ లు అస్వస్థతకు గురయ్యారు. వీరిద్దరిని  ఆసుపత్రికి తరలించారు. నిన్న ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు  ప్రయత్నించిన  ఘటనలో  ముగ్గురు అస్వస్థతకు గురైన విసయం తెలిసిందే.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పెట్రోల్ బంకుల‌కు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు, నో స్టాక్ బోర్డులు.. అస‌లేం జ‌రుగుతోంది.?
Garikapati Gurajada : గరికపాటి నరసింహరావు గుడ్డు వివాదం.. అసలు ఈయన కొడుకు ఏం చేస్తారో తెలుసా..?