హరికృష్ణ వెంట ఎప్పుడూ ఆ ఇద్దరే...

By narsimha lodeFirst Published Aug 30, 2018, 1:29 PM IST
Highlights

 మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వెంటే  ఆ ఇద్దరు మిత్రులు ఎప్పుడూ ఉండేవారు.  అన్నెపర్తి వద్ద  హరికృష్ణ నడుపుతున్న కారుకు ప్రమాదం జరిగిన సమయంలో కూడ  శివాజీ, వెంకట్రావు కూడ ఉన్నారు. 
 

హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వెంటే  ఆ ఇద్దరు మిత్రులు ఎప్పుడూ ఉండేవారు.  అన్నెపర్తి వద్ద  హరికృష్ణ నడుపుతున్న కారుకు ప్రమాదం జరిగిన సమయంలో కూడ  శివాజీ, వెంకట్రావు కూడ ఉన్నారు. 

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత హరికృష్ణ మరణించాడు. హరికృష్ణతో  రావి వెంకటరావు, శివాజీలు చాలా సన్నిహితంగా ఉండేవారు. వెంకటరావు  హైద్రాబాద్ శివారల్లో డెయిరీ ఫాం నిర్వహించేవాడు.  30 ఏళ్ల క్రితం వెంకట్రావుతో హరికృష్ణకు పరిచయం ఏర్పడింది.అప్పటి నుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది.

వెంకట్రావు స్వగ్రామం కృష్ణా జిల్లా మోపిదేవి.ఓ సినిమాలో గోవు అవసరం ఉంటే హరికృష్ణ  వెంకట్రావు వద్దకు వెళ్లి తీసుకెళ్లాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని చెబుతుంటారు. హరికృష్ణ తరచూ వెంకట్రావు డెయిరీ ఫాం వద్దకు వెళ్లి  గడిపేవారు. 

శివాజీ కూడ ఎప్పుడూ హరికృష్ణతో ఉండేవాడు.  వెంకట్రావు,శివాజీలతో కలిసి హరికృష్ణ బయటకు వెళ్లేవాడు.  దూర ప్రయాణాలు చేయాల్సివస్తే హరికృష్ణ వెంకట్రావు, శివాజీలతో కలిసి వెళ్లేవాడని  చెబుతున్నారు. 

హరికృష్ణకు శస్త్రచికిత్సలు అయినప్పటి నుండి వాహనం నడపడం కొంచెం తగ్గించాడు. బుధవారం నాడు ఉదయం పూట  హరికృష్ణ తాను వాహనం నడుపుకొంటూ వెళ్లాడు. శివాజీ, వెంకట్రావులను  వారి ఇళ్ల వద్దకు వెళ్లి పికప్ చేసుకొన్నాడు. 

కారును నడుపుతానని వెంకట్రావు  హరికృష్ణతో అన్నారు. అయితే  టిఫిన్ చేసిన తర్వాత  కారు నడిపాలని హరికృష్ణ ..వెంకట్రావుకు సూచించాడు.టిఫిన్ చేయకముందే అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందాడు. 


ఈ వార్తలు చదవండి

నందమూరి కుటుంబానికి ఈ రహదారి శాపం: యాక్సిడెంట్ జోన్లు ఇవే

హరికృష్ణ మృతి: వస్తానంటే ఆ డ్రైవర్‌ను వద్దన్నాడు

హరికృష్ణ మృతి: అతను డ్రైవర్‌గా చేరి ఉంటే..

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

రవాణా మంత్రిగా హరికృష్ణ సంచలన నిర్ణయం....తెలుగింటి మహిళల కోసం....

 

click me!