రవాణా మంత్రిగా హరికృష్ణ సంచలన నిర్ణయం....తెలుగింటి మహిళల కోసం....

By Arun Kumar PFirst Published Aug 30, 2018, 1:03 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపి, సీని నటులు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో  తెలుగు ప్రజలు ముఖ్యంగా సీనీ అభిమానులు, టిడిపి కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. వారితో పాటు తెలుగింటి మహిళలు కూడా ఆయన అకాల మృతిపై ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ రవాణా మంత్రిగా వున్న సమయంలో మహిళల కోసం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు మహిళలు కండక్టర్లుగా పనికిరారంటూ వారిని ఆ ఉద్యోగాలకు అనర్హులుగా భావించేవారు. అయితే హరికృష్ణ ఈ విషయంలో మిగతావారితో విబేధించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో మహిళా కండక్టర్ల నియామకాలను చేపట్టాలని మంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటివరకు ఆర్టీసీలో మహిళపై ఉన్న చిన్నచూపును తగ్గించి వారికి నైతిక స్థైర్యాన్ని అందించారు.

ఇలా తన జీవిత కాలంలో మంత్రిగానే కాదు పలు హోదాల్లో మహిళా అభ్యన్నతికి హరికృష్ణ పాటుపడ్డారు. మహిళలు ఏ విషయంలోనూ మగవారితో తక్కువ కాదని, వారికి కాస్త ప్రోత్సాహం అందిస్తే అన్నిరంగాల్లో దూసుకుపోతారనే అభిప్రాయాన్ని హరికృష్ణ కలిగివుండేవారు. ఇందులో భాగంగానే మహిళా కండక్టర్ల నియామకాన్ని చేపట్టారు. ఈ నిర్ణయంతో ఆయమ మహిళల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.     

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ పై  క్లిక్ చేయండి

హరికృష్ణ మృతి...ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులు సంతాప దినాలు

హరికృష్ణకు నివాళి: బాబును పలకరించిన గవర్నర్ (ఫోటోలు)

 నేను తర్జుమా చేస్తే హరికృష్ణ వద్దన్నాడు: గుర్తు చేసుకున్న వెంకయ్య

click me!