నిజామాబాద్‌లో ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి పోలీసుల అదుపులో ఇద్దరు

Published : Apr 11, 2023, 11:35 AM ISTUpdated : Apr 11, 2023, 12:17 PM IST
నిజామాబాద్‌లో  ధర్మపురి  సంజయ్ ఇంటిపై దాడి పోలీసుల అదుపులో  ఇద్దరు

సారాంశం

నిజామాబాద్  లో  కాంగ్రెస్  నేత  ధర్మపురి  సంజయ్   ఇంటిపై  గుర్తు తెలియని దుండగులు  దాడి కి దిగారు.

నిజామాబాద్: కాంగ్రెస్ నేత ధర్మపురి  సంజయ్  ఇంటిపై  మంగళవారంనాడు దాడి  జరిగింది.ఈ దాడిపై  సంజయ్  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.  సంజయ్ ఇంటిపై దాడికి దిగిన  ఇద్దరు అనుమానితులను  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  సంజయ్ ఇంట్లోకి  వెళ్లేందుకు  కూడా  ఈ ఇద్దరు  ప్రయత్నించారు.  అయితే  సంజయ్  ఇంటి వద్ద  ఉన్నవారు  ఈ  ఇద్దరిని అడ్డుకున్నారు.  అసలు  వీరిద్దరూ  ఎందుకు  సంజయ్ ఇంటిపై దాడికి  పాల్పడ్డారనే  విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

ఇవాళ  ఉదయం  ఆరున్నర గంటల  సమయం నుండి  తన ఇంటి వద్ద  ఇద్దరు  వ్యక్తులు  రెక్కీ  చేశారని సంజయ్  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.  అంతేకాదు  తన ఇంటిపై దాడి  చేశారని  కూడా  ఫిర్యాదు  చేశారు.  ఇంట్లోకి దౌర్జన్యంగా  ప్రవేశించే  ప్రయత్నం చేశారని  ఆయన  ఆరోపించారు.

also read:కాంగ్రెస్‌లో చేరిన డీఎస్, సంజయ్: పార్టీ కండువా కప్పిన ఠాక్రే

ఈ ఏడాది  మార్చి 26న ధర్మపురి సంజయ్  కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  సంజయ్ తో పాటు  ఆయన  తండ్రి  డి.శ్రీనివాస్ కూడా  కాంగ్రెస్ తీర్ధం  పుచ్చుకున్నారు.అయితే  మరునాడే  డీఎస్  కాంగ్రెస్ పార్టీకి  రాజీనామాను  ప్రకటించారు.   కాంగ్రెస్ పార్టీలో  చేరే రోజున కూడా  సంజయ్  మాత్రమే కాంగ్రెస్ పార్టీలో  చేరుతారని  డీఎస్ పేరుతో  ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వెలువడిన  కొద్దిసేపటికే  గాంధీ భవన్ కు  ధర్మపురి  సంజయ్ తో పాటు డి.శ్రీనివాస్ గాంధీ భవన్ కు  చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో  చేరారు. 

 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం