టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : మరో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్, ఏఈ ప్రశ్నాపత్రం కొన్నట్లుగా గుర్తింపు

Siva Kodati |  
Published : May 09, 2023, 05:38 PM ISTUpdated : May 09, 2023, 05:39 PM IST
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : మరో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్, ఏఈ ప్రశ్నాపత్రం కొన్నట్లుగా గుర్తింపు

సారాంశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంగళవారం మరో నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు . నిందితులంతా ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ కొన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది. ఏఈ పేపర్ కొనుగోలు చేసిన నలుగురిని సిట్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా ప్రవీణ్ నుంచి పేపర్ కొన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరితో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 27కి చేరింది. 

Also Read: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. తమ్ముడు కోసం పేపర్ కొనుగోలు చేసిన అన్న..!

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో నిన్న కూడా మరో ముగ్గురిని  సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నాపత్రం  కొనుగోలు  చేసిన ముగ్గురిని  సిట్ బృందం  అరెస్ట్  చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ నుండి   ప్రశ్నాపత్రం కొనుగోలు  చేసిన  ముగ్గురిని  సిట్ టీమ్ అరెస్ట్  చేసింది. మనోజ్, మురళీధర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని  సిట్  అరెస్ట్  చేసింది. ఏఈ ప్రశ్నపత్రాన్ని  రూ.10 లక్షలకు  ప్రవీణ్ విక్రయించారని సిట్ బృందం  గుర్తించింది. ఏఈ ప్రశ్నాపత్రాన్ని ఆరుగురికి ప్రవీణ్ విక్రయించాడని  సిట్ గుర్తించింది.  

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?