మరణమృదంగం... సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కరోనాతో మృతి

Published : May 25, 2021, 05:20 PM ISTUpdated : May 25, 2021, 05:28 PM IST
మరణమృదంగం... సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కరోనాతో మృతి

సారాంశం

రాజన్న సిరిసిల్లా జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతిచెందారు.

 సిరిసిల్ల: తెలంగాణలో కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతిచెందారు. ఇటీవలే కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటిక్రితమే మృతిచెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. 

15రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో అంజయ్య టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఇలా 15 రోజులుగా కరోనాతో పోరాడుతున్న అంజయ్య ఆరోగ్యం ఇవాళ(మంగళవారం) పూర్తిగా క్షీణించింది.  దీంతో కొద్దిసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.

read more పెళ్ళయిన పన్నెండు రోజుల్లోనే... కరోనాతో యువకుడు మృతి

పెద్దదిక్కుగా వున్న అంజయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. అదనపు కలెక్టర్ అంజయ్య మృతి పట్ల జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం మంచి అధికారిని కోల్పోయిందన్నారు. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?