టవరెక్కిన సింగరేణి ఆగ్రహం

First Published Jun 21, 2017, 3:44 PM IST
Highlights

సింగరేణి సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకవైపు కార్మికులు సమ్మెబాట పడితే మరోవైపు అధికారులు, అధికార పార్టీ అనుబంధ సంఘం నేతలు సమ్మె విచ్ఛిన్నానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలను సమ్మెలో కార్మికులు అదేరీతిలో తిప్పి కొడుతున్నారు. రెండు వర్గాల పోరుతో సింగరేణిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

https://www.facebook.com/seheri.yaro/videos/762393910588427/?autoplay_reason=gatekeeper&video_container_type=1&video_creator_product_type=2&app_id=350685531728&live_video_guests=0

సింగరేణి సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకవైపు కార్మికులు సమ్మెబాట పడితే మరోవైపు అధికారులు, అధికార పార్టీ అనుబంధ సంఘం నేతలు సమ్మె విచ్ఛిన్నానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలను సమ్మెలో కార్మికులు అదేరీతిలో తిప్పి కొడుతున్నారు. రెండు వర్గాల పోరుతో సింగరేణిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బుధవారం నాటికి సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెను మరింత తీవ్రతరం చేశాయి కార్మిక సంఘాలు. ఇద్దరు సింగరేణి కార్మిక నేతలు టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం ఉదయం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(autuc)కు చెందిన ఇద్దరు నాయకులు 5బీ పీవీకేలో షాప్ట్‌ హెడ్‌ మీదకు ఎక్కి దూకుతామని బెదిరించారు. కూసన వీరభద్రం, రఘు అనే యూనియన్‌ నేతలు, సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్న అధికారుల తీరుకు నిరసనగా ఈ తరహా ఆందోళనకు దిగినట్లు కార్మికులు చెప్పారు. కేజీ టవర్‌ ఎక్కి దూకుతామని హెచ్చరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సమ్మెను తీవ్రతరం చేయడంతో సింగరేణి కార్మికులపై నిర్బంధాన్ని మరింత పెంచింది సర్కారు. నిరసనకు దిగుతున్న కార్మికులను నిర్బంధించి దూర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు కార్మికుల ఆందోళనలతో సింగరేణి అట్టుడికిపోయింది.

click me!