ఫామ్ హౌసేనా ఆయన తెలంగాణా

Published : Jun 21, 2017, 03:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఫామ్ హౌసేనా ఆయన తెలంగాణా

సారాంశం

తెలంగాణ సిఎం  కెసిఆర్ పై మాటల దాడి ఉధృతం చేశారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. ఇప్పటికే తెలంగాణ  సర్కారు పాలనలో కంపు కొడుతోందని, చేతకాకపోతే దిగిపోవాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన కోదండరాం ఇప్పుడు మరో అడుగు  ముందుకేసి విమర్శల వర్షం  కురిపిస్తున్నారు.

తెలంగాణ సిఎం  కెసిఆర్ పై మాటల దాడి ఉధృతం చేశారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. ఇప్పటికే తెలంగాణ  సర్కారు పాలనలో కంపు కొడుతోందని, చేతకాకపోతే దిగిపోవాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన కోదండరాం ఇప్పుడు మరో అడుగు  ముందుకేసి విమర్శల వర్షం  కురిపిస్తున్నారు.

 

తెలంగాణ జెఎసి స్పూర్తి యాత్ర సంగారెడ్డి  జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం గన్ పార్కు  వద్ద నివాళులు అర్పించిన కోదండరాం సంగారెడ్డిలో అమరుల స్పూర్తి యాత్ర మొదలు పెట్టారు. ఈ యాత్రలో  కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు కోదండరాం.

 

కెసిఆర్ సిఎం అయిన తర్వాత ఎక్కువ కాలం అయితే ఫాం హౌజ్ కు లేదంటే ప్రగతి భవన్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. ప్రజల వద్దకు రావడంలేదని, ప్రజలను ఆయన వద్దకు రానీయడంలేదని ఆరోపించారు. దళితులకు మూడెకరాల  భూమి ఇవ్వాలంటే కెసిఆర్ సర్కారుకు 230 ఏళ్లు  పడుతుందని ఎద్దేవా చేశారు.

 

మిషన్ భగీరథ పేరుతో ఉన్న పైపులు పీకి కొత్త పైపులు వేసి కాంట్రాక్టర్లను మేపుతున్నారని విమర్శించారు. బక్కచిక్కి అప్పుల  బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతను మాత్రం ఆదుకోవడంలేదన్నారు. రైతుల రుణమాఫి ఒకేసారి చేయడానికి సర్కారుకు మనసు రావడంలేదని విమర్శించారు.

 

కెసిఆర్ ఇలాకాలో  కోదండరాం యాత్రకు జనాల నుంచి మంచి స్పందన వస్తోందని జెఎసి నేతలు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu