యోగా దినాన కెసిఆర్ ఎక్కడ? బాబు బిజి అక్కడ

Published : Jun 21, 2017, 01:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
యోగా దినాన  కెసిఆర్ ఎక్కడ? బాబు బిజి అక్కడ

సారాంశం

ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. భారతదేశమంతా యోగాలో మునిగిపోయారు. చిన్నా పెద్దా తేడాలేదు, అధికారులు, నాయకులతోపాటు అన్ని వర్గాల వారు ఉదయం నుంచి యోగాలో పాల్గొని హడావిడి చేస్తున్నారు.

ఇక తెలుగు  రాష్ట్రాల్లో యోగా హడావిడి జోరుగా సాగుతోంది. ఎపి  సిఎం చంద్రబాబు ఉదయం ఆరున్నరకే యోగా చేశారు. ఎపిలో మంత్రులు, అధికారులు, టిడిపి పార్టీ నేతలు, ఇతర అన్ని రాజకీయ పార్టీల నేతలు సైతం యోగాలో మునిగిపోయారు.

 

ఇక తెలంగాణలోనూ యోగాలో బాగానే పాల్గొన్నారు జనాలు. తెలంగాణ మంత్రివర్గంలోని చాలామంది మంత్రులు  యోగా చేశారు. మంత్రులు మహమూద్ అలీ, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు యోగాలో ఉత్సాహంగా  పాల్గొన్నారు. గవర్నర్ నర్సింహ్మన్ దంపతులు రాజ్ భవన్ లో యోగా డే లో పాల్గొన్నారు. 

 

మరి తెలంగాణ సిఎం కెసిఆర్ మాత్రం యోగాలో  పాల్గొన్నారా  లేదా అన్నది ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కెసిఆర్ యోగా చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి  అధికారిక సమాచారం అందించలేదు. ఫొటోలు కానీ, వీడియోలు కానీ విడుదల చేయలేదు. అయితే సిఎం మాత్రం  ప్రగతి భవన్ లోనే ఉన్నట్లు సిఎంఓ వర్గాలు తెలిపాయి.

 

ఇంకో ముచ్చటేమంటే గత ఏడాది సైతం సిఎం కెసిఆర్ యోగా లో పాల్గొనలేదు. ఎందుకు కెసిఆర్ యోగా  లో పాల్గొనడంలేదని పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే