చకచకా సాగుతున్నసిద్ధిపేట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు

First Published Oct 25, 2016, 9:51 AM IST
Highlights
  • చకా చకా సాగుతున్న సిద్ధిపేట్ మెడికల్ కాలేజీ  ఏర్పాటు
  • మెడికల్ కాలేజీ స్థలం  ఎంపిక  కోసం కసరత్తు మొదలు

విఐపి రాజకీయాలకు సంబంధించి  తెలంగాణా రికార్డు సష్టించబోతున్నది. సాధారణంగా రాష్ట్రంలో సాధారణంగా  విఐపి  ఒకటే వుంటుంది.  అరుదుగా, ముఖ్యమంత్రి , ప్రధాన మంత్రి లేదా మరొక కేంద్ర మంత్రి ఒకే  రాష్ట్రా నికి చెంది ఉంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ఒక పార్లమెంటు నియోజకవర్గం విఐపి హోదా దక్కించుకుంటాయి. కేంద్ర మంత్రుల నియోజకవర్గాలన్నింటికి ఈ అవకాశం రాదు,  కేంద్ర రైల్వే మంత్రికి తప్ప. ఇది చాలా అరుదు. అయితే, తెలంగాణాలో ఇపుడు మూడు విఐపి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక సభ నియోజకవర్గం ఉన్నాయి. అవి సిద్ధిపేట్,  గజ్వేల్, సిరిసిల్లా అసెంబ్లీ స్థానాలు, నిజాం బాద్ లోక్ సభ నియోజకవర్గం.

 సిద్ధిపేట్, గజ్వేల్ రెండు ఒక జిల్లాలో ఉండటంలో ఇందులో ఒకటయిన గజ్వేల్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహించడం, రెండోది సిద్ధిపేట్ చురుకయిన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇంకా ఇతర కారణాలు తోడయి, సిద్ధిపేట్ ఒక విఐపి జిల్లాగా మారిపోతున్నది.

సిద్ధిపేటకు తొలివరం మెడికల్ కాలేజీ. జిల్లాలను ప్రకటిస్తున్న రోజునే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  జిల్లా కేంద్రంలో ఒక  ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల కిందట  క్యాబినెట్ ఈ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఈ రోజు కాలేజీ నిర్మాణానికి స్థలం ఎంపిక మొదలు పెట్టారు. ఈమేరకు ఇవాళ కాలేజీ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. వైద్యశాఖాధికారులు స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో వైద్యశాఖ అధికారులు సమావేశమయ్యారు. కాలేజీకి 50 ఎకరాల స్థలం సేకరించడం గురించి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టర్ తో  చర్చించారు. ప్రాజక్టుకు రూపకల్పన శరవేగంగా జరగుతూ ఉంది.

 ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే అనుబంధంగా కనీసం మూడు వందల  పడకల అసుప్రతి ఉండాలి.  ఇంత పెద్ద అసుపత్రి రావడం సిద్ధిపేట ప్రాముఖ్యాన్ని పెంచుతుంది. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని   ముఖ్యమంత్రి అదేశాలిచ్చారు.

click me!