జాతీయ స్థాయిలో మెరిసిన సిద్దిపేట.. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కైవసం.. మంత్రి హరీష్ రావు అభినందనలు

By telugu teamFirst Published Nov 10, 2021, 7:31 PM IST
Highlights

సిద్దిపేట పేరు మరోసారి జాతీయస్థాయిలో మారుమోగుతున్నది. సిద్దిపేట స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైంది. మంత్రి హరీష్ రావు సిద్దిపేట పురప్రముఖులకు అభినందనలు తెలిపారు. ఈ నెల 20న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లు ఈ అవార్డు అందుకోనున్నారు.

హైదరాబాద్: Siddipet పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ఇప్పటికే సుమారు 17 రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి Awardలను గెలుచుకున్న సిద్దిపేట తాజాగా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్(Swachh Survekshan) అవార్డును కైవసం చేసుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, తడి, పొడి చెత్తల సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో సిద్దిపేటకు మంచి గుర్తింపు ఉన్నది. తాజాగా, మరోసారి సిద్దిపేట.. శుద్ధిపేట అని చాటుకుంది. మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైంది. 

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ఎంపిక కావడానికి మూడు అంశాల్లో సిద్దిపేట 50 సూచికలను సాధించింది. వీటితోపాటు సేవాస్థాయి పురోగతి, నాణ్యమైన చెత్త సేకరణ.. ఇందుకు మూడు రకాల తడి, పొడి, హానికరమైన చెత్త సేకవరణ.. వాటికి ప్రత్యేకంగా వాహనాల నిర్వహణ, పారిశుధ్య పనితీరరు,  సర్టిఫికేషన్ విధానం.. ఈ అన్ని రకాల నిర్ణయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం, వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛ్ యాప్ ఉపయోగించడం వంటి అనేక కీలక నిర్ణయాలు సిద్దిపేటలో అమలయ్యాయి. సిద్దిపేట అవార్డుకు ఎంపిక కావడంలో ఈ అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 

Also Read: స్నేహితులతో విందు, అంతలోన్ గన్ మిస్ ఫైర్: సిద్దిపేట జిల్లాలో యువకుడి మృతి

సూర్య కిరణాల కాంతి వెలుగులో సిద్దిపేట మెరవాలి.. చంద్రుడు సైతం సిద్దిపేటను తొంగి చూడాలి... అనే పాట పారిశుధ్యంపై సిద్దిపేట ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తెచ్చింది. అవార్డు ఎంపికలో ఈ పాట కూడా మంచి పాత్ర పోషించింది.

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారిలు ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ నెల 20న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అందుకోనున్నారు. ఇందుకోసం వీరిరువరిని అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానమూ వచ్చింది. 

సిద్దిపేటకు అవార్డు ఎంపిక కావడంపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పుర ప్రజల ఐక్యత, వారి భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించాయని, అభివృద్ధి, అవార్డుల్లో వారు ఎంతో స్ఫూర్తిని చాటుతున్నారని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపిక కావడంపై సిద్దిపేట పుర ప్రజలకు అభినందనలు తెలిపారు. వివిధ అంశాల్లో దాదాపు 17 అవార్డులు సాధించిన సిద్దిపేట ఇప్పుడు మరో అవార్డుకు ఎంపిక కావడం గొప్ప విషయమని, ఇది ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల చొరవ, అధికారుల అంకిత భావంతోనే సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో పట్టణం మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని కోరారు.

Also Read: వరి వేస్తే వేటాడుతా.. సుప్రీం చెప్పినా వినను : సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై దుమారం.. రేవంత్ ఫైర్

సిద్దిపేట అభివృద్ధిలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన స్ఫూర్తే ఉన్నదని, స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ మంత్రి హరీష్ రావు సూచనలు, సలహాలు తీసుకున్నామని మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారిలు చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, మున్సిపల్ అధికారుల పని తీరుకు నిదర్శనమే ఈ అవార్డు అని తెలిపారు.

సిద్దిపేట ఇది వరకు 17 అవార్డులు పొందింది. 2012లో క్లీన్ సిటీ చాంపియన్‌షిప్ అవార్డు(రాష్ట్ర స్థాయి) క్లిన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు, 2015లో ఎక్స్‌లెన్స్ అవార్డు ( సాలీడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ - జాతీయ స్థాయి), 2016లో ఎక్స్‌లెన్స్ అవార్డు (పారిశుద్ధ్య నిర్వహణ - జాతీయ స్థాయి), 2016లో హరిత మిత్ర అవార్డ్ (రాష్ట్ర స్థాయి), 2016లో స్కోచ్ అవార్డు.. చెత్త సేకరణ, 100శాతం మరుగుదొడ్ల నిర్మాణంలో జాతీయ స్థాయి అవార్డ్, 2016లో ఓడీఎఫ్ సర్టిఫికెట్ (జాతీయ స్థాయి), 2016లో ఎక్స్ లెన్స్ అవార్డు (రాష్ట్ర స్థాయి) సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది.

click me!