ప్రేమోన్మాది ఘాతుకం: పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలిపై దాడి , 18 కత్తిపోట్లు.. చావు బతుకుల్లో యువతి

Siva Kodati |  
Published : Nov 10, 2021, 06:39 PM ISTUpdated : Nov 10, 2021, 07:13 PM IST
ప్రేమోన్మాది ఘాతుకం: పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలిపై దాడి , 18 కత్తిపోట్లు.. చావు బతుకుల్లో యువతి

సారాంశం

హైదరాబాద్‌‌లో (Hyderabad) దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో హస్తినాపురంలో (hastinapuram) యువతిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. నిందితుడిని బస్వరాజుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌‌లో (Hyderabad) దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో హస్తినాపురంలో (hastinapuram) యువతిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. నిందితుడిని బస్వరాజుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆమెను 18 సార్లు పొడిచినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ALso Read:పెద్దపల్లి : ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తిపీటతో ప్రియురాలి గొంతు కోసి హత్య

కాగా.. నిన్న పెద్దపల్లి జిల్లాలో ఇదే తరహాలో (peddapalli district) దారుణం జరిగింది. రామగుండం (ramagundam) కేకే నగర్ కాలనీలో పెళ్లికి నిరాకరించందనే అక్కసుతో ప్రియురాలిని గొంతుకోసి హత్యచేశాడో ప్రేమోన్మాది. కెకె నగర్‌కు చెందిన గొడుగు అంజలి అనే యువతి తారకరామారావు నగర్‌కు చెందిన చాట్ల రాజు అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ రాజు వేధింపులకు గురిచేయటంతో రెండు సార్లు పంచాయతీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజు ఇంట్లో చోరబడి అంజలిని (anjali) కత్తిపీటతో గొంతు కోసి హత్య చేశాడు. దీంతో అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు