
మంచిర్యాల జిల్లా (mancherial district) సింగరేణి గని ప్రమాద ఘటనలో (singareni collieries company limited) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. అందులో చిక్కుకుపోయిన ఓ కార్మికుని మృతదేహాన్ని బయటకు తీశారు. మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. మృతులను కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), చంద్రశేఖర్(29), నర్సింహరాజు(30)గా గుర్తించారు. అధికారుల తప్పిదంతోనే ఎస్ఆర్‌పీ- 3 గనిలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి.