Ram Mandir: అయోధ్యలో రాముడి పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆహ్వాన పత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Ram Mandir:ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ నేరవేరుతోంది. కోట్లాది మంది హిందూవులు వేచి చూస్తున్న ఆవిష్కృతం అవుతుంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభం భారతీయుల దశాబ్దాల పోరాటం కల నెరవేరబోతుంది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బాలరాముడు శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు.
ఇప్పటికే ప్రజలంతా రామనామస్మరణలో మునికి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట మహాత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. తాజా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఆహ్వానం పంపించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
మరోవైపు.. జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపారు. ఇక ఇప్పటికే జనవరి 22 వ తేదీ జరగనున్న రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అయోధ్య రామునికి వివిధ రూపాలలో సేవలు అందుతున్నాయి.
ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులకు ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే.. ఇటీవల సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే.. ఆయన చేతి కర్ర సాయంతో నడక మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.