లోక్‌సభ ఎన్నికలు : తెలంగాణపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి రథయాత్ర

By Siva Kodati  |  First Published Jan 19, 2024, 8:38 PM IST

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ బలంగా వున్న తెలంగాణపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటిన బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. 


త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ.. సౌత్‌లోనే మకాం వేశారు, కేరళ నుంచి ఆయన ప్రచారం మొదలుపెడతారని టాక్ నడుస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ బలంగా వున్న తెలంగాణపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటిన బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్రలు చేపట్టనుంది. ఈ యాత్ర ఐదు పార్లమెంట్ క్లస్టర్స్ పరిధిలో .. ప్రతిరోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. 

కాగా.. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్రంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. మొత్తం 12 మంది అధ్యక్షులను మారుస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 6 మోర్చాలకు అధ్యక్షులను కూడా మార్పు చేశారు .

Latest Videos


కొత్తగా నియమితులైన బీజేపీ జిల్లా అధ్యక్షులు :

* మహబూబ్ నగర్ – పీ శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్ – గంట రవి
* నారాయణపేట – జలంధర్ రెడ్డి
* వికారాబాద్ – మాధవరెడ్డి
* నల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
* ములుగు – బలరాం
* నిజామాబాద్ – దినేష్ కుమార్
* పెద్దపల్లి – చందుపట్ల సునీల్
* సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
* సిద్దిపేట – మోహన్ రెడ్డి
* యాదాద్రి – పాశం భాస్కర్
* వనపర్తి – డి నారాయణ


6 మోర్చాలా అధ్యక్షులు :

* ఎస్టీ మోర్చా – కల్యాణ్ నాయక్
* ఓబీసీ మోర్చా – ఆనంద్ గౌడ్
* మహిళ మోర్చా – డాక్టర్ శిల్పా
* కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి
* ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
* యువ మొర్చా – మహేందర్
 

click me!