Sonia Gandhi: కరెంటు బిల్లులు మీరే కట్టాలి.. : సోనియా గాంధీకి నాగోలు వాసుల లేఖ

By Mahesh K  |  First Published Jan 19, 2024, 8:40 PM IST

ఇంటికి ఉచిత కరెంట్ అందిస్తామని, బిల్లులు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలేదని నాగోలు వాసులు మండిపడ్డారు. సోనియా గాంధీకి లేఖలు రాశారు.
 


BRS Party: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరెంట్ బిల్లులు తామే కడుతామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ, కరెంట్ బిల్లులు మాత్రం కట్టడం లేదని నాగోలు ప్రజలు ఆగ్రహించారు. 200 యూనిట్ల కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడం లేదని అన్నారు. కాబట్టి, ఈ హామీని అమలు చేయాలని, ఇంటి కరెంట్ బిల్లులు కట్టాలని కోరుతూ సోనియా గాంధీకి లేఖ రాశారు. శుక్రవారం వారు పోస్టు కార్డులు పోస్టు బాక్స్‌లో వేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత కరెంట్ హామీ చేయలేదని, కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, తాము మాఫీ చేస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు నెలలు తామే కరెంట్ బిల్లులు చెల్లించామని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి అన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా గృహ విద్యుత్ దారులందరికీ 200 యూనిట్లు వరకు కరెంట్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Latest Videos

Also Read : Revanth Reddy: దావోస్‌లో మెరిసిన తెలంగాణ.. రూ. 40 వేల కోట్ల ఒప్పందాలు, గతేడాది కంటే రెట్టింపు

ఇప్పుడు బస్తీల్లో నుంచి తక్కువ ఉత్తరాలే వస్తున్నాయని, అదే ఇచ్చిన హామీ నెరవేరకపోతే మాత్రం లక్షల సంఖ్యలో ఉత్తరాలు సోనియా గాంధీకి పంపిస్తామని అన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నుంచి బీఆర్ఎస్ పార్టీ దిగిపోయి ప్రతిపక్షంగా మారిన సంగతి తెలిసింది.

click me!