కీలక సమావేశానికి డుమ్మా.. జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు, 24 గంటల డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Apr 02, 2023, 08:22 PM IST
కీలక సమావేశానికి డుమ్మా.. జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు, 24 గంటల డెడ్‌లైన్

సారాంశం

జనగామ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు.

జనగామ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. దీంతో పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

ఇకపోతే.. జంగా రాఘవరెడ్డి తీరుపై హన్మకొండ డీసీసీ నాయిని రాజేందర్ రెడ్డి ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా విమర్శలు గుప్పించడం ఇటీవల కలకలం రేగింది. జనగామ జిల్లాకు రాఘవరెడ్డి డీసీసీ కాదని.. విపక్షాలకు లాభం కలిగిలా జంగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్యర్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు అతికించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also REad: కీలక సమావేశానికి డుమ్మా.. బాధ్యతల నుంచి తప్పిస్తాం : పీసీసీ ప్రధాన కార్యదర్శులపై మాణిక్‌రావ్ థాక్రే ఆగ్రహం

తన అనుమతి లేకుండా హనుమకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. తనకే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని.. ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారని నాయిని గుర్తుచేస్తున్నారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని.. జంగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానం కాపీని అధిష్టానానికి పంపించామని.. అక్కడి స్పందనను బట్టి , తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu