గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి హత్య కేసు: వెంకటేష్, దివ్య రహస్య వివాహం

Published : Feb 19, 2020, 04:08 PM ISTUpdated : Feb 20, 2020, 06:34 PM IST
గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి హత్య కేసు: వెంకటేష్, దివ్య రహస్య వివాహం

సారాంశం

గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి దివ్యను వెంకటేష్ గతంలో పెళ్లి చేసుకొన్నాడని వెంకటేష్ తండ్రి పరుశురాం  చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 

గజ్వేల్: బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకటేష్ , దివ్యలు గతంలో ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొన్నారని వెంకటేష్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Also read:దివ్య హత్య కేసు: వేములవాడలో లొంగిపోయిన వెంకటేష్

ఉస్మానియా  యూనివర్శిటీలో దివ్య చదువుకొనే సమయంలో వెంకటేష్‌తో మధ్య పరిచయం ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. దివ్యను ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

Also read:దివ్య హత్య కేసు: పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు

మరో వైపు దివ్య, వెంకటేష్‌లు ఇద్దరూ రహస్యంగా కూడ వివాహం చేసుకొన్నారని వెంకటేష్ తండ్రి పరశురాములు ఓ తెలుగు న్యూస్ చానల్ ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాడు.

ప్రేమ పెళ్లి తర్వాత దివ్య, వెంకటేష్ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో పోలీస్ స్టేషన్ లో దివ్య ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో  దివ్య జోలికి వెళ్లనని వెంకటేష్ పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా రాసిచ్చినట్టుగా  చెబుతున్నారు.

దివ్యకు పెళ్లి కుదిరిన విషయం తెలుసుకొన్న వెంకటేష్ ఆమెపై కక్ష పెంచుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. 

ఈ నెల 18వ తేదీ సాయంత్రం నుండి వెంకటేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని  తండ్రి పరశురామ్ చెప్పారు. దివ్య కేసు విచారణ కోసం పోలీసులు వెంకటేష్ తండ్రి పరశురామ్, తల్లి మల్లీశ్వరీని పోలీసులు వేములవాడ నుండి గజ్వేల్‌కు తీసుకొచ్చారు. 


 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?