నల్గొండలో ఉద్రిక్తత: కోమటిరెడ్డికి కంచర్ల కౌంటర్

By narsimha lodeFirst Published Feb 19, 2020, 2:55 PM IST
Highlights

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య  బుధవారం నాడు వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.


నల్గొండ: నల్గొండలో  బుధవారం నాడు పంచాయితీరాజ్ సమ్మేళనంలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య బుధవారం నాడు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు వేదికపైకి వచ్చారు. రెండు పార్టీల కార్యకర్తలకు పోలీసులు సర్ధిచెప్పి కిందకు పంపారు. 

పంచాయితీరాజ్ సమ్మేళనాన్ని బుధవారం నాడు నల్గొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. తొలుత ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించారు.

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తొలుత ప్రసంగించారు. ఈ సమయంలో పల్లె ప్రగతి నిధులు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు.

ఈ విషయమై నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటరిచ్చారు. 

ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పందించారు. ఎమ్మెల్యేగా తాను చెప్పాలనుకొన్న విషయాన్ని చెప్పే హక్కు తనకు ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి కంచర్ల భూపాల్ రెడ్డికి మధ్య  తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. 

మునుగోడు ఎమ్మెల్యే ను రాజగోపాల్ రెడ్డికి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య వాదనలు తీవ్రమౌతున్న తరుణంలో  రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒక్కసారిగా వేదికపైకి దూసుకు వచ్చారు.

 ఈ సమయంలో పోలీసులు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను అదుపు చేశారు.రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు సర్ధిచెప్పారు. ఎమ్మెల్యేలను కూడ సముదాయించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది


 

click me!