శెభాష్ పిల్లలు.. మామిడి పెంకలను మొక్కలుగా మార్చిన చిన్నారులకు మంత్రి గంగుల అభినందన..

Published : Dec 25, 2021, 04:52 PM IST
శెభాష్ పిల్లలు.. మామిడి పెంకలను మొక్కలుగా మార్చిన చిన్నారులకు మంత్రి గంగుల అభినందన..

సారాంశం

మామిడి పెంకలను మొక్కలుగా మార్చిన చిన్నారులను మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు తీసుకొచ్చిన మామిడి పండ్ల నుంచి పెంకలు సేకరించి మొక్కలుగా మార్చారు. 

ఆ పిల్ల‌లకు ప్ర‌కృతి అంటే ఇష్టం. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌టానికి త‌మ వంతుగా ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నారు. దాని కోసం మొక్క‌ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఎలా పెంచాలో.. ఏ మొక్క‌లు పెంచాలో వారికి తెలియ‌దు. అయితే ఆ పిల్ల‌ల త‌ల్లిండ్రులు తెచ్చిన మామిడి పండ్ల‌లోని పెంక‌ల‌నే మొక్క‌లుగా ఎందుకు మార్చ‌కూడ‌ద‌ని అనుకున్నారు. గ‌త స‌మ్మ‌ర్ లో వాళ్ల ఇంటికి తీసుకొచ్చిన మామిడి పండ్ల నుంచి పెంక‌ల‌ను వేరు చేశారు. వాటిని జాగ్ర‌త్త‌గా క్లీన్ చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ గ్గాసుల్లో మ‌ట్టి వేసి వాటిని ఉంచారు. కొంత కాలం త‌రువాత వాటిలో మొల‌క‌లు వ‌చ్చాయి. అనంత‌రం వాటిని కొంత పెద్ద ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లోకి మార్చారు. వాటికి ప్ర‌తీ రోజు నీళ్లు పోశారు. అలా చేయ‌డం వ‌ల్ల ఇప్పుడు దాదాపు 200 మొక్క‌లు ప్రాణం పోసుకున్నాయి. 

ఐదు చీరలకు ఒక పాత్ర.. స్టీల్ సామాను షాపుల్లోకి బతుకమ్మ సారె, వీడియో వైరల్

హైద‌రాబాద్ ప‌ట్ట‌ణానికి చెందిన చ‌ల్ల రాముకు ఇద్ద‌రు పిల్ల‌లు. ఇందులో దశీత‌కు ప‌ద‌కొండేళ్లు, సాహ‌ర్ష్‌కు ఏడేళ్లు. తండ్రి ఓ ప్రైవేట్ బ్యాంకులో ప‌ని చేస్తున్నారు. ఈ పిల్ల‌ల‌కు మొక్క‌లు పెంచాల‌ని కోరిక‌. గ‌త ఎండాకాలంలో తండ్రి ఇంటికి తీసుకొచ్చిన మామ‌డి పండ్ల నుంచి జాగ్ర‌త్త‌గా పెంక‌ల‌ను సేక‌రించారు. వాటిని చిన్న చిన్న క‌వ‌ర్ల‌లో వేసి మొక్కలుగా మార్చారు. వీటికి ప్ర‌తీ రోజు నీరు, పోష‌కాలు అందించ‌డంతో అవి ఎప్పుడు బాగా పెరిగాయి.  వారి చేసిన ప‌ని వ‌ల్ల దాదాపు 200 మొక్క‌లు నాటేందుకు సిద్ధ‌మ‌య్యాయి. వీరిని కృషిని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అభినందించారు. ఆ పిల్ల‌లు, వారి తల్లిదండ్రులు ఈరోజు మంత్రిని ఆయ‌న ఛాంబ‌ర్‌లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లకు అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం హ‌రిత‌హారం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని అన్నారు. ఈ పిల్ల‌ల‌ను అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఆకాంక్షించారు. 

తీన్మార్ మల్లన్నకు చెప్పు దెబ్బలు పడతాయ్ - టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?