వైసీపీకి తోకపార్టీ కాదు, అవసరమైతే ఏపీతో తలపడతాం: రాఘవరెడ్డి

By narsimha lodeFirst Published Feb 9, 2021, 2:17 PM IST
Highlights

తెలంగాణలో సీఎం అభ్యర్ధి వైఎస్ షర్మిల అని ... షర్మిలకు సన్నిహితుడు రాఘవరెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణలో సీఎం అభ్యర్ధి వైఎస్ షర్మిల అని ... షర్మిలకు సన్నిహితుడు రాఘవరెడ్డి ప్రకటించారు.

also read:జగన్ ఏపీలో పనిచేస్తున్నాడు, నేను తెలంగాణ కోసం పనిచేస్తా: షర్మిల

నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి రోజున పార్టీని ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. ఏపీలో పార్టీని ఇక్కడ నిర్వహించబోమన్నారు.వైసీపీకి తాము తోకపార్టీగా ఉండబోమని ఆయన స్పష్టం చేశారు.

అవసరమైతే నీళ్లు, నిధుల కోసం ఏపీ సర్కార్ తో తలపడనున్నట్టుగా చెప్పారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు సృష్టించొద్దని ఆయన సూచించారు.వాళ్లిద్దరూ ఒక్కటేనని ఆయన ప్రకటించారు.ప్రపంచంలో 3 వేల కి.మీ పాదయాత్ర చేసిన రికార్డు షర్మిలపై ఉందన్నారు. 

నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ పాలన గురించి షర్మిల ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన వచ్చిన నాటి నుండి తెలంగాణలో అందరికీ అన్ని న్యాయం జరిగిందా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో కూడ రాజన్న రాజ్యం తెచ్చేందుకు గాను తాము ప్రయత్నిస్తామని షర్మిల ప్రకటించారు.

click me!