జగన్ ఏపీలో పనిచేస్తున్నాడు, నేను తెలంగాణ కోసం పనిచేస్తా: షర్మిల

Published : Feb 09, 2021, 02:00 PM IST
జగన్ ఏపీలో పనిచేస్తున్నాడు, నేను తెలంగాణ కోసం పనిచేస్తా: షర్మిల

సారాంశం

జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఆయన పని ఆయన చేసుకొంటున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.


హైదరాబాద్: జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఆయన పని ఆయన చేసుకొంటున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.మంగళవారం నాడు లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో మాట్లాడిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాను మాత్రం తెలంగాణలో నా పని నేను చేసుకొంటానని ఆమె స్పష్టం చేశారు.

also read:రాజన్న రాజ్యం మనతోనే సాధ్యం: షర్మిల

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరేళ్లు దాటినా ఏ ఒక్క వర్గం కూడ సంతోషంగా లేరన్నారు.రైతులు, విద్యార్ధులు,  సంతోషంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు.ప్రతి ఒక్కరికి ఇళ్లు వచ్చాయా అని ఆమె అడిగారు. ప్రతి జిల్లావారితో మాట్లాడానికే వచ్చానన్నారు. చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆమె తెలిపారు. చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. రాజన్న రాజ్యం తేవాలనేది తన కంటే నల్గొండ జిల్లాకు చెందిన  నేతలు పట్టుదలగా ఉన్నారని చెప్పారు.

తెలంగాణలో పాదయాత్ర చేసే అవకాశం కూడ ఉందని ఆమె మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అయితే పాదయాత్ర ఎప్పుడు చేస్తారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !