బంగారు తెలంగాణలో రైతన్నకు పురుగుమందే మిగిలేలా ఉంది

First Published May 16, 2017, 5:00 PM IST
Highlights

సీఎం పండించిన క్యాప్సికంకు కోట్ల రూపాయిల రాబడి వస్తుంటే... రైతన్నల మిర్చి పంటకు కనీసం గిట్టు బాటు ధర కూడా ఎందుకు రావడం లేదు...?

బంగారు తెలంగాణ వచ్చినా రైతు బతుకు ఎందుకు బాగుపడటం లేదు... ?

 

మూడేళ్ల స్వపాలనలో అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు... ?

 

సీఎం పండించిన క్యాప్సికంకు కోట్ల రూపాయిల రాబడి వస్తుంటే... రైతన్నల మిర్చి పంటకు కనీసం గిట్టు బాటు ధర కూడా ఎందుకు రావడం లేదు...?

 

రైతును రాజును చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆ రైతుకే పోలీసులు బేడీలేసే కోర్టుకు లాగితే ఎందుకు స్పందించడం లేదు...?

 

రైతు రాజ్యం కాస్త రాక్షస రాజ్యంగా ఎందుకు మారుతోంది...?

 

ఈ మార్పు రైతన్న నిజంగా ఊహించే ఉండడు.అందుకే నాడు కారు గుర్తుకు ఓటేసి బంగారు కలలు కన్నాడు. ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రాక లబోదిబో అంటున్నాడు.

 

 

కానీ, స్వపాలకులు మాత్రం వారి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి సమైక్య పాలకులను మించి అన్నదాతపై లాఠీన్యం చూపుతున్నారు. వారికి బేడీలేసి కోర్టుకు లాగుతున్నారు.

 

అంతేనా, ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతన్నలను ఆదుకొనే విషయం మరిచి రాష్ట్రంలో అలాంటి ఘటనలే లేవని నమ్మబలుకుతున్నారు.

ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయం ఎదురుగానే ఓ రైతన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గద్వాల జోగులాంబ ప్రాంతానికి చెందిన మల్లేష్‌ అనే రైతు ఐదు సార్లు బోరు వేసినా నీళ‍్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల‍్లో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ‍్బందులతో బాధపడుతున‍్న అతడు సీఎంను కలవాలని మంగళవారం ఉదయమే ఇక్కడికి వద‍్దకు వచ్చాడు.

 

కానీ,  పోలీసులు ఆయనను లోపలికి రానివ్వలేదు. దీంతో ఆవేదన చెందిన మల్లేష్ వెంట తెచ్చుకున‍్న పురుగుల మందు తాగాడు. పోలీసులు వెంటనే స్పందించి ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించడంతో చావు తప్పింది.

click me!