తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ..

Published : Apr 28, 2023, 06:07 PM IST
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ..

సారాంశం

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది.

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్‌డీగా  ఉన్న అశోక్‌ రెడ్డి.. ఐ అండ్ పీఆర్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. సీసీఎల్‌ఏ సెక్రటరీగా బి గోపికి  పోస్టింగ్ ఇచ్చారు. వనపర్తి అడిషినల్ కలెక్టర్గా ఉన్న ఆశిష్ సంగ్వాన్‌ను సీసీఎల్‌ఏ స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. అదే సమయంలో సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా ఉన్న కే హైమవతి, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న సత్య శారదా దేవీలను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్