జనగామ కాంగ్రెస్‌లో రచ్చ: భట్టి సమక్షంలో పొన్నాల, కొమ్మూరి వర్గాల ఆధిపత్య పోరు

Published : Apr 28, 2023, 03:57 PM IST
 జనగామ కాంగ్రెస్‌లో  రచ్చ: భట్టి  సమక్షంలో  పొన్నాల,  కొమ్మూరి  వర్గాల  ఆధిపత్య పోరు

సారాంశం

జనగామ అసెంబ్లీ  నియోజకవర్గంలో  కాంగ్రెస్  నేతల మధ్య ఆధిపత్య పోరు  నెలకొంది.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి , పొన్నాల లక్ష్మయ్య వర్గాలు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎదుటే వాగ్వాదానికి  దిగారు.     


వరంగల్: జనగామ అసెంబ్లీ  నియోజకవర్గంలో  కాంగ్రెస్ నేతల  మధ్య  ఆధిపత్యపోరు  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర సాక్షిగా  బట్టబయలైంది.  మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య,  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  వర్గాలు  వాగ్వాదానికి దిగారు.  ఇరువర్గాలను  పోలీసులు చెదరగొట్టారు.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క   పాదయాత్రకు   స్వాగతం  పలికేందుకు  రెండు వర్గాలు పోటీపడ్డాయి.   ఇరువర్గాలు  తమ ఆధిపత్యం కోసం పోటీలు పడి  రచ్చ చేయడంపై  సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం  చేశారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించవద్దని ఇరువర్గాల నేతలకు  ఆయన సూచించారు.

జనగామ అసెంబ్లీ  నియోజకవర్గంలో  పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  వర్గాల మధ్య  ఆధిపత్యపోరు  కొనసాగుతుంది.   అవకాశం దొరికినప్పుడల్లా  పరస్పరం ఫిర్యాదు  చేసేందుకు  ప్రతాప్ రెడ్డి,  పొన్నాల లక్ష్మయ్య  వర్గీయులు  ప్రయత్నిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్