తెలంగాణ సచివాలయం ఓపెనింగ్.. భద్రతపై డీజీపీ, సీపీ సమీక్ష

Siva Kodati |  
Published : Apr 28, 2023, 04:04 PM ISTUpdated : Apr 28, 2023, 04:05 PM IST
తెలంగాణ సచివాలయం ఓపెనింగ్.. భద్రతపై డీజీపీ, సీపీ సమీక్ష

సారాంశం

తెలంగాణ నూతన సచివాలయానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీకి సంబంధించి డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లు సమీక్ష నిర్వహించారు.   

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 30 సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో తెలంగాణ కొత్త సచివాలయం వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తుండగా.. 300 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లు భద్రతను సమీక్షించారు. కమాండెంట్ స్థాయి అధికారి ఈ భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా మూడంచెల భద్రతపై సమీక్షించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతపై సూచనలు, సలహాలు ఇచ్చారు డీజీపీ. 

ఇదిలా ఉంటే.. ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత నూతన సచివాలయాల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతులపై జరుగనున్నది. ఆ     తరువాత నేరుగా 6వ అంతస్తులో వున్న తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు తమతమ చాంబర్లలో అడుగుపెడుతారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనున్నది. 

ALso Read: నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకం ఏ ఫైల్ పైనా?

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు  పాల్గొంటార‌ని స‌మాచారం. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్